Page Loader
Archery World Cup Final 2024: ఆర్చరీ వరల్డ్ కప్‌ ఫైనల్.. రజత పతకాన్ని కైవసం చేసుకున్న దీపికా కుమారి 
ఆర్చరీ వరల్డ్ కప్‌ ఫైనల్.. రజత పతకాన్ని కైవసం చేసుకున్న దీపికా కుమారి

Archery World Cup Final 2024: ఆర్చరీ వరల్డ్ కప్‌ ఫైనల్.. రజత పతకాన్ని కైవసం చేసుకున్న దీపికా కుమారి 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2024
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి ఈసారి రజత పతకంతోనే తన ప్రయాణాన్ని ముగించుకుంది. ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్‌కి చేరుకున్న ఆమెకు చైనా ఆర్చర్ లి జియామన్‌ నుంచి గట్టి పోటీ ఎదురైంది. లి ప్రతి రౌండ్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ, 0-6 తేడాతో దీపికాను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుపొందింది. మూడేళ్ల విరామం తర్వాత వరల్డ్ కప్ ఫైనల్స్‌కి చేరిన దీపికా అద్భుతంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 2022లో కుమార్తె జననం తర్వాత దీపికా కొంతకాలం ఆటకు దూరంగా ఉండటం తెలిసిందే. ఈసారి సెమీ ఫైనల్స్ వరకు వచ్చి, ఫైనల్‌లో కొంత తడబాటుకు గురైంది. వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఇది ఆమెకు ఐదవ రజత పతకం కావడం గమనార్హం.

Details

బంగారు పతకం ఏకైక ఆర్చర్ డోలా బెనర్జీ

ఇప్పటి వరకు ఆమె ఒక కాంస్య పతకాన్ని కూడా గెలుచుకుంది. భారత్ తరఫున ఇప్పటివరకు బంగారు పతకం సాధించిన ఏకైక ఆర్చర్ డోలా బెనర్జీ. పురుషుల రికర్వ్ విభాగంలో తెలుగు ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరకి కూడా నిరాశ ఎదురైంది. దక్షిణ కొరియా ఆర్చర్ లీ వూ సియోక్‌తో జరిగిన కఠిన పోటీలో ధీరజ్ చివర్లో ఒత్తిడిని తట్టుకోలేక 2-4 తేడాతో పరాజయం పొందాడు. భారత బృందంలో ఉన్న ఐదుగురు ఆర్చర్లలో దీపికా కుమారే కేవలం రజత పతకాన్ని సాధించి తిరిగి వచ్చింది.