
ENG vs IND: ఆసియా రూల్స్ ఇక్కడేలా ?.. స్లో ఓవర్‌రేట్‌పై ఆగ్రహించిన బెన్ స్టోక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మరోసారి తన దూకుడును ప్రదర్శించారు. భారత్‌తో మాంచెస్టర్ వేదికగా జరుగనున్న నాలుగో టెస్టు ముందు విలేకరులతో మాట్లాడిన స్టోక్స్, తమ ఆట శైలిపై ఏమాత్రం తగ్గదని స్పష్టం చేశారు. అంతేకాదు, స్లో ఓవర్‌రేట్, స్లెడ్జింగ్ వంటి అంశాలపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇటీవల మా జట్టుపై ఐసీసీ 10 శాతం ఫైన్‌తో పాటు రెండు పాయింట్ల కోత విధించింది. కానీ ఓవర్‌రేట్ విషయంలో నాకు పెద్దగా ఆందోళన లేదు. మేం కావాలనే ఓవర్లను నెమ్మదిగా వేశామని కాదు. కొన్ని సందర్భాల్లో ఫ్రస్ట్రేషన్‌తో ఆ టైమ్‌ను మించి ఉండవచ్చు. ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటివి సీమ్ ఫ్రెండ్లీ కండిషన్లు. ఇక్కడ స్పిన్నర్లు తక్కువగా ఉంటారు.
Details
స్లెడ్జింగ్ విషయంలో తగ్గేదేలే
స్పిన్నర్లతో ఓవర్లు వేయడం తక్కువ సమయం పడుతుంది. కానీ సీమ్ బౌలర్లతో అలాంటి వేగం సాధ్యం కాదు. ఆసియాలో స్పిన్నర్లే ఎక్కువగా బౌలింగ్ చేస్తారు. అందుకే అక్కడా, ఇక్కడా ఒకే రూల్ వర్తింపజేయడం సరికాదు. కాంటినెంట్ల స్థాయిలో నిబంధనల్ని సవరించాల్సిన అవసరం ఉందని స్టోక్స్ పేర్కొన్నాడు. లార్డ్స్ టెస్టులో బౌలర్ బషీర్ గాయం పొందిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. 'ఆ మ్యాచ్‌లో మేం ఓవర్లు త్వరగా పూర్తిచేయలేకపోయిన ఒక కారణం అది కూడా. ఎక్కువగా ఫాస్ట్ బౌలర్లపైనే ఆధారపడాల్సి వచ్చిందని వివరించాడు. స్లెడ్జింగ్ అంశాన్ని కూడా స్టోక్స్ స్పష్టం చేశాడు. మేం స్లెడ్జింగ్ చేయాలనుకోం. కానీ ప్రత్యర్థి జట్టు ఏదైనా విధంగా అప్రొచ్ అయితే, మేం కూడా వెనక్కి తగ్గమని పేర్కొన్నారు.
Details
నాలుగో టెస్టుకు విశ్రాంతి దొరికింది
ఇరు జట్లు అత్యుత్తమంగా ఆడుతున్నాయి. నాలుగో టెస్టుకు మేము బాగా విశ్రాంతి తీసుకున్నాం. రెండు రోజులు పూర్తిగా రిలాక్స్ అయ్యాను. నా కుటుంబంతో గడిపిన సమయం ఎంతో స్పెషల్. ఇప్పుడు మళ్లీ ఉత్సాహంగా మైదానంలో అడుగుపెడతామని తెలిపారు. ఇంకా, మాంచెస్టర్ టెస్ట్ గురించి మాట్లాడుతూ ఈ గ్రౌండ్‌లో క్రిస్ వోక్స్‌కు మంచి రికార్డు ఉంది. అది మాకు సానుకూలతనిస్తుందని స్టోక్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు.