Page Loader
అర్జెంటీనా స్టార్‌ లియోనల్‌ మెస్సీ హ్యాట్రిక్ గొల్స్‌తో రికార్డు
మరో అరుదైన ఘనతను సాధించిన మెస్సీ

అర్జెంటీనా స్టార్‌ లియోనల్‌ మెస్సీ హ్యాట్రిక్ గొల్స్‌తో రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 29, 2023
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

అర్జెంటీన్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ కురాకోతో జరిగిన ఫెండ్లీ మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించిన మెస్సీ అర్జెంటీనా తరుపున వంద అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 7-0తో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఆట 20, 33, 37వ నిమిషాల్లో మెస్సీ గోల్స్‌ చేశాడు.అతడితో పాటు నికోలస్ గొంజాలెజ్, ఎంజో ఫెర్నాండెజ్, ఏంజెల్ డి మారియా, గొంజలో మోంటియెల్ గోల్స్ చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం మెస్సీ ఖాతాలో 102 గోల్స్‌ ఉన్నాయి. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మెస్సీ(174 మ్యాచ్‌ల్లో 102 గోల్స్‌) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

రోనాల్డ్

ఏడుసార్లు హ్యాట్రిక్ గోల్స్ సాధించిన రోనాల్డ్

అంతకుముందు ఈ రికార్డును క్రిస్టియానో ​​రొనాల్డో (122), ఇరాన్ మాజీ లెజెండ్ అలీ దాయి (109) సాధించారు. మెస్సీకి అర్జెంటీనా తరపున ఇది ఏడో అంతర్జాతీయ హ్యాట్రిక్‌ గోల్స్‌ కావడం విశేషం. ఇటీవల మెస్సీ రొనాల్డో తర్వాత కెరీర్‌లో 800 గోల్స్ సాధించిన రెండవ ఆటగాడిగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 832 గోల్స్ చేసిన రొనాల్డో.. గోల్స్ పరంగా అర్జెంటీనా కెప్టెన్ కంటే ముందున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కురాకోను అర్జెంటీనా 7-0 తేడాతో చిత్తుగా ఓడించింది.