Page Loader
US Open 2023 : ఫైనల్‌కు దూసుకెళ్లిన అరీనా సబలెంకా
ఫైనల్‌కు దూసుకెళ్లిన అరీనా సబలెంకా

US Open 2023 : ఫైనల్‌కు దూసుకెళ్లిన అరీనా సబలెంకా

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2023
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

2023 యూఎస్ ఓపెన్‌లో అరీనా సబలెంకా అద్భుత ఫామ్‌తో చెలరేగుతోంది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో మాడిసన్ కీస్‌ 0-6, 7-6(1), 7-6(5)తో అరీనా సబలెంకా చిత్తు చేసింది. దీంతో సబలెంకా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచులో కోకో గాఫ్‌తో అరీనా సబలెంకా పోటీ పడనుంది. మొదటి సెట్‌ను 6-0తో కైవసం చేసుకుని ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన కీస్, తర్వాత చెత్త ప్రదర్శనతో మ్యాచును చేజార్చుకుంది. ఆరంభంలోనే తన సర్వీస్‌ను కోల్పోయినా గట్టిగానే పోరాడింది. రెండో, మూడో సెట్లలో సబలెంకా చెలరేగి ఆడటంతో కీస్ ఓటమిపాలైంది.

Details

ఫైనల్‌లో కోకో గౌఫ్‌ తో తలపడనున్న సబాలెంకా 

ఈ మ్యాచులో సబలెంకా 12 ఏస్ లను సాధించగా, మాడిసన్ కిస్ 5 ఎస్ లను సాధించింది. సబలెంకా మొదటి సర్వేలో 65 శాతం, రెండో సర్వేలో 63శాతం విజయాన్ని నమోదు చేసింది. ఇక బ్రేక్ పాయింట్లు 3/10 గా మలిచింది. సబాలెంకా ఇప్పుడు ఫైనల్‌లో కోకో గౌఫ్‌తో తలపడుతుంది, కోకో గౌఫ్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో కరోలినా ముచోవాను ఓడించింది. సబలెంకా, కోకో గౌఫ్ ఫైనల్ మ్యాచుతో తలపడుతుండటంతో వీరి మధ్య పోటీ ఉత్కంఠంగా జరిగే అవకాశం ముంది ఇక యూఎస్ ఫైనల్ మ్యాచులో ఎవరు గెలిస్తారో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.