
Arjun tendulkar: అర్జున్ తెందూల్కర్ నిశ్చితార్థం వార్తలు హల్‌చల్… అమ్మాయి ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇంట త్వరలోనే పెళ్లి శుభవార్త వినిపించనుందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. సచిన్ తనయుడు అర్జున్ తెందూల్కర్ త్వరలో ఇంటివాడు కాబోతున్నాడని సమాచారం. ముంబయికి చెందిన సానియా చందోక్‌తో అర్జున్ నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నిశ్చితార్థం జరిగిందని వార్తలు వైరల్ అవుతున్నా, ఇరువైపుల కుటుంబాల నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
Details
సానియా చందోక్ ఎవరు?
సానియా చందోక్ ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు. రవి ఘాయ్ కుటుంబం ఆతిథ్య, ఆహార రంగాల్లో పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. వీరిద్దరికీ ఇంటర్‌కాంటినెంటల్ హోటల్, ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ 'బ్రూక్లిన్ క్రీమరీ'తో పాటు మరెన్నో బిజినెస్‌లున్నాయి. సానియా చాలాలో ప్రొఫైల్ జీవనశైలిని కొనసాగిస్తూ, "మిస్టర్ పాస్ పెట్ స్పా & స్టోర్‌లో భాగస్వామిగా, డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది.
Details
అర్జున్ క్రికెట్ ప్రస్థానం
లెఫ్ట్ ఆర్మ్ పేసర్, బ్యాటర్‌గా అర్జున్ తెందూల్కర్ భారత జట్టులోకి ప్రవేశించేందుకు కష్టపడుతున్నాడు. దేశీయ క్రికెట్‌లో గోవా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అతను ఇప్పటివరకు 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 37 వికెట్లు, 532 పరుగులు సాధించాడు. అలాగే 24 టీ20 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు తీసి, 119 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.