ఐపీఎల్‌లో తొలి వికెట్ తీసిన అర్జున్ టెండుల్కర్.. రోహిత్ ఫుల్ జోష్!
ఈ వార్తాకథనం ఏంటి
లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్లో తొలి వికెట్ ను సాధించాడు.
ఐపీఎల్ లో ఆడిన రెండో మ్యాచ్‌లో ఆ ఘనతను సాధించాడు. ఐపీఎల్లో దాదాపు రెండేళ్ల నిరీక్షణ తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో అర్జున్ అరంగేట్రం చేశాడు.
మొదటి మ్యాచ్ లో వికెట్లు తీయకపోయినా.. రెండో మ్యాచ్ లో మాత్రం తన మొదటి వికెట్ ను తీశాడు.
మంగళవారం సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై 14 పరుగుల తేడాతో గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 192 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన సన్ రైజర్స్ 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది.
details
సంబరాల్లో మునిగిపోయిన ముంబై టీం సభ్యులు
తొలుత రెండు ఓవర్లు వేసిన ఆర్జున్ టెండుల్కర్ 14 పరుగులకు ఇచ్చాడు.
అయితే చివరి ఓవర్ లో సన్ రైజర్స్ కి 20 పరుగులు అవసరం కాగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, అర్జున్ టెండుల్కర్ కి బంతిని అప్పగించాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన అర్జున్.. ఐదో బంతికి భువనేశ్వర్ ని ఔట్ చేశాడు.
దీంతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. దీంతో రోహిత్ శర్మతో పాటు టీం సభ్యులు అర్జున్ తో కలిసి సంబరాల్లో మునిగిపోయారు.
అయితే ముంబై ఇండియన్స్ ఈ విజయంతో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది.