LOADING...
Arshdeep Singh: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్.. 100 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ పేసర్!
చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్.. 100 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ పేసర్!

Arshdeep Singh: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్.. 100 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ పేసర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 16, 2026
09:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయిని చేరిన ఈ ఎడమచేతి పేసర్, ఇప్పుడు ఐపీఎల్‌లోనూ శతక వికెట్ల క్లబ్‌లోకి ప్రవేశించాడు. పంజాబ్ కింగ్స్ తరఫున ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్ రియాన్ రికెల్టన్‌ను ఔట్ చేయడం ద్వారా అర్ష్‌దీప్ ఈ ప్రత్యేక మైలురాయిని అందుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో 100 వికెట్ల క్లబ్‌లో చేరిన ఐదో బౌలర్‌గా తన పేరును నమోదు చేసుకున్నాడు. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న అర్ష్‌దీప్ సింగ్, 19వ ఐపీఎల్ సీజన్‌లో మరింత ప్రభావవంతమైన ప్రదర్శన కనబరుస్తూ వికెట్ల పండగను కొనసాగిస్తున్నాడు.

వివరాలు

అగ్రస్థానంలో ట్రరెంట్ బౌల్ట్

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రికెల్టన్ వికెట్‌తో శతక వికెట్ల మైలురాయిని పూర్తి చేసి ఈ లీగ్‌లో తన ప్రయాణానికి మరో కీలక మలుపు తీసుకొచ్చాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన భారత బౌలర్లలో వెటరన్ జహీర్ ఖాన్ (102 వికెట్లు), అశిష్ నెహ్రా (106 వికెట్లు), జయదేవ్ ఉనాద్కట్ (114 వికెట్లు) ఉన్నారు. వీరిలో జహీర్ ఖాన్, అశిష్ నెహ్రా ఇప్పటికే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికగా, ఉనాద్కట్ ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. మరోవైపు ప్రస్తుతం అత్యధిక ఐపీఎల్ వికెట్లతో టాప్‌లో ఉన్న బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 144 వికెట్లతో కొనసాగుతున్నాడు.

Advertisement