
MI's Ashwani Kumar: ఎంఐ తరఫున అరంగేట్రంలోనే 4 వికెట్లు తీసిన అశ్విని కుమార్
ఈ వార్తాకథనం ఏంటి
ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 23 ఏళ్ల యువ బౌలర్ అశ్వని కుమార్ తన ఐపీఎల్ అరంగేట్రాన్ని చేశారు.
తొలి బంతికే వికెట్ తీసుకున్న ఈ బౌలర్, ఇంటర్నెట్‌లో సంచలనంగా మారిపోయాడు.
ఎడమచేతి వేగం బౌలర్‌గా బరిలోకి దిగిన అశ్విని కుమార్,తన మొదటి బంతికే కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేను పెవిలియన్‌కు పంపాడు.
అంతేకాకుండా, 3 ఓవర్లు వేసిన అశ్విని, కేవలం 24 పరుగులే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు.దీంతో తన తొలి మ్యాచ్‌ను చిరస్మరణీయంగా మార్చుకున్నాడు.
వివరాలు
ఐపీఎల్ అరంగేట్రంలో తొలి బంతికే వికెట్- అరుదైన ఘనత
అశ్వని కుమార్ ఈ అద్భుతమైన ప్రదర్శనతో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు.
అయితే,ఒక బౌలర్ ఐపీఎల్ అరంగేట్రంలో మొదటి బంతికే వికెట్ తీసుకోవడం ఇది మొదటిసారి కాదు.
ఐపీఎల్ చరిత్రలో ఇదివరకు కూడా తొలిసారి బరిలో దిగిన బౌలర్లు తమ తొలిబంతికే వికెట్ సాధించిన సందర్భాలు ఉన్నాయి.
మొత్తం ఇప్పటివరకు 10మంది బౌలర్లు ఈఅరుదైన ఘనతను సాధించారు.
ఐపీఎల్‌లో తొలి బంతికే వికెట్ తీసిన తొలి బౌలర్ ఎవరు?
ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఈ ఘనత అందుకున్న బౌలర్ ఇషాంత్ శర్మ.
2008లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన ఇషాంత్ శర్మ,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను పెవిలియన్‌కు పంపి ఈ రికార్డు నెలకొల్పాడు.
వివరాలు
ఐపీఎల్‌లో తొలి బంతికే వికెట్ తీసిన ఆటగాళ్ల పూర్తి జాబితా ఓసారి చూద్దాం..
2008 ఇషాంత్ శర్మ రాహుల్ ద్రవిడ్ KKR vs RCB
2008 విల్కిన్ సురేష్ రైనా PBKS vs CSK
2009 షేన్ హార్వుడ్ అజార్ బిలాఖియా RR vs DC
2009 అమిత్ సింగ్ సన్నీ సోహల్ RR vs PBKS
2009 చార్ల్ లాంగెవెల్డ్ట్ రాబ్ క్వినీ KKR vs RR
2010 అలీ ముర్తజా నమన్ ఓజా MI vs RR
2012 టిడి సుధీంద్ర ఫాఫ్ డు ప్లెసిస్ఎం DC vs CSK
2019 అల్జారి జోసెఫ్ డేవిడ్ వార్నర్ఎం MI vs SRH
2022 మథీష పతిరానా శుభ్‌మాన్ గిల్ CSK vs GT
2025 అశ్వని కుమార్ఎం అజింక్య రహానే MI vs KKR
వివరాలు
ఐపీఎల్ అరంగేట్రంలో ఎంతమంది ఎంఐ స్టార్లు తొలి బంతికే వికెట్ తీసుకున్నారు?
అశ్వని కుమార్, ముంబై ఇండియన్స్ తరఫున తన తొలి బంతికే వికెట్ తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు.
అలీ ముర్తజా vs రాజస్థాన్ రాయల్స్, 2010 (నమన్ ఓజా)
అల్జారి జోసెఫ్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, 2019 (డేవిడ్ వార్నర్)
అశ్వని కుమార్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, 2025 (అజింక్య రహానే)
ఈ విధంగా, ఐపీఎల్‌లో అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో అశ్విని కుమార్ చరిత్ర సృష్టించాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అరంగేట్రంలోనే 4 వికెట్లు తీసిన అశ్విని కుమార్
Ashwani Kumar is on fire! 🔥
— Anup barnwal (@amethiya_anup) March 31, 2025
4 wickets on debut – what a sensational performance!
Cleaning up Andre Russell and Manish pandey is no small feat. pic.twitter.com/ruHmfs7CJA