LOADING...
IND vs UAE: ఆసియా కప్‌ 2025.. ఇవాళ యూఏఈతో తలపడనున్న భారత్! 
ఆసియా కప్‌ 2025.. ఇవాళ యూఏఈతో తలపడనున్న భారత్!

IND vs UAE: ఆసియా కప్‌ 2025.. ఇవాళ యూఏఈతో తలపడనున్న భారత్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 10, 2025
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ 2025 టీ20 టోర్నమెంట్‌లో భాగంగా టీమిండియా సెప్టెంబర్ 10న తమ తొలి మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుంది. టీ20 ప్రపంచ చాంపియన్‌ భారత్‌ కోసం యూఏఈపై గెలుపు సాధించడం పెద్ద కష్టమే కాకపోయినా, ఈ ఫార్మాట్‌లో ఏ జట్టుని తక్కువ అంచనా వేయరాదు. యూఏఈ ఇటీవల బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్ గెలవడం అందరికీ తెలిసిందే. పాకిస్తాన్‌తో కీలక పోరు ఎదుర్కోవడానికి ముందు, భారత్ అన్ని రంగాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. ఈ మ్యాచ్‌ టీమిండియాకు జట్టు కౌశల్యాలను పరీక్షించే అవకాశం కూడా ఇస్తుంది. జట్టు ఎంపిక ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. 2024 టీ20 వరల్డ్ కప్‌ విజేతగా భారత్‌ 24 మ్యాచ్‌లు గెలిచి, మూడింటిలోనే ఓడిపోయింది.

Details

మూడో స్థానంలో తిలక్ వర్మ

శుభ్‌మన్ గిల్ పునరాగమనంతో ఓపెనింగ్‌ జట్టులో తప్పనిసరి మార్పులు అవసరం. అతను అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్‌ ఇన్నింగ్స్ ఆడతాడు. మూడో స్థానంలో తిలక్‌ వర్మ స్థిరంగా నిలిచినప్పటికీ, నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతారు. దీని ఫలితంగా వికెట్ కీపర్‌ సంజూ శాంసన్‌కు అవకాశాలు పరిమితమయ్యాయి. సంజూ శాంసన్ సాధారణంగా టాప్-3లో బ్యాటింగ్ చేస్తాడు. అయితే ఆ స్థానంలో ఆడకపోతే, తుది జట్టులో చోటు పొందడం కష్టమే అని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ప్రాక్టీస్ సెషన్‌లు చూసి ఫినిషర్‌గా జితేశ్ శర్మ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేల్‌తో పాటు, బౌలింగ్‌లో బుమ్రా, అర్ష్ దీప్‌ స్థిరమైన స్థానాలు ఖాయం.

details

అక్షర్ పటేల్ అడే అవకాశాలు ఎక్కువ

మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా ఆటలో ఉండే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన ఒక్క స్థానానికి కుల్దీప్, వరుణ్ చక్రవర్తి మధ్య తీవ్ర పోటీ కొనసాగుతుంది. యూఏఈ చిన్న జట్టే అయినప్పటికీ, టీ20, టీ10 ఫార్మాట్‌లో కొన్ని సంవత్సరాలుగా ఆడుతూ ప్రమాదకరమైన బ్యాటర్లు తమ సత్తాను చాటుకున్నారు. సిరీస్‌లో మహ్మద్ వసీమ్ కెప్టెన్‌గా, షరాఫు, అసిఫ్ ఖాన్, హైదర్ అలీ, జునైద్ సిద్ధిఖ్, మహ్మద్ రోహిద్ వంటి బౌలర్లు ఆటలో ఉన్నారు. భారత్‌పై గెలుపు తప్పక, యూఏఈ గట్టి పోటీని ఇవ్వగలదు.

Details

స్పిన్ కు అనుకూలంగా పిచ్ లు

చాంపియన్స్ ట్రోఫీ సమయంలో పిచ్‌లు ఎక్కువగా స్పిన్‌కు అనుకూలంగా ఉండగా, ఇప్పుడు దుబాయ్‌లో కొత్త, జీవం ఉన్న పిచ్‌లు సిద్ధం. బ్యాట్స్‌మెన్‌కు పేసర్లకు కూడా సమానంగా అవకాశం ఉంది. తీవ్ర ఎండ ఉన్నప్పటికీ ఆటగాళ్లు కఠిన శ్రమ చేయాల్సి ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్‌ ఎంచుకోవచ్చు. వర్షం రాకపోవడం కూడా పాజిటివ్ అంశం.