
Asia Cup 2025: ఆసియా కప్ 2025.. దుబాయ్‌లో భారత్ జట్టు.. హార్దిక్ పాండ్యా స్టైలిష్ లుక్ వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ టీ20 2025 కోసం భారత జట్టు శుక్రవారం దుబాయ్ చేరింది. జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ప్రధాన బ్యాట్స్‌మన్ శుభ్మాన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, ఆలరౌండర్ హార్దిక్ పాండ్యా ICC అకాడమీ గ్రౌండ్‌లో కనిపించారు. అయితే, జట్టు రాక కంటే హార్దిక్ పాండ్యా లుక్పై అభిమానుల చర్చ ఎక్కువగానే ఉంది.ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి సెప్టెంబర్ 28 వరకు జరుగుతుంది. భారతదేశం సెప్టెంబర్ 10న UAEతో తన టోర్నమెంట్ ప్రారంభం చేస్తుంది. సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో, సెప్టెంబర్ 19న ఒమన్‌తో మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న సమయంలో హార్దిక్ పాండ్యా స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. అతను కొత్త 'జుట్టు స్టైల్'ను ఎంచుకున్నాడు.
Details
8 సార్లు విజేతగా భారత్
సైడ్ హెయిర్ చిన్నగా, వెనుక పొడవాటి జడ లాంటి జుట్టు, తల మొత్తం శాండి బ్లాండ్ కలర్‌లో రంగు. టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్, ఒమన్, UAEజట్లు గ్రూప్-Aలో ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, హాంకాంగ్ గ్రూప్-Bలోకి విభజించారు. ప్రతి గ్రూప్‌లోని జట్లు ఒకదానితో ఒకటి 1-1 మ్యాచ్‌లు ఆడతాయి. సూపర్-4 దశలో భారత్, పాకిస్తాన్ చేరితే, రెండు జట్లు సెప్టెంబర్ 21న మళ్లీ తలపడతాయి. ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది. సూపర్-4లో భారత్, పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉంటే, టోర్నమెంట్‌లో వీరి మధ్య మూడో మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఆసియా కప్ ఇప్పటివరకు 16 సార్లు జరిగింది. భారతదేశం అత్యధికంగా 8 సార్లు, శ్రీలంక 6 సార్లు, పాకిస్తాన్ 2 సార్లు గెలిచింది.