
Asia Cup 2025: భారత్‌తో మ్యాచ్‌కు ముందే పాకిస్తాన్ బౌలర్ రిటైర్మెంట్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2025 మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. సెప్టెంబర్ 10న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, యూఏఈ జట్లు తలపడనుండగా, సెప్టెంబర్ 12న పాకిస్తాన్ ఒమన్‌తో మ్యాచ్ ఆడనుంది. అందులో హై ఓల్టేజ్ మ్యాచ్‌గా సెప్టెంబర్ 14న భారత్,పాకిస్థాన్ మధ్య పోరు జరుగుతుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందే పాకిస్తాన్ బౌలర్ ఉస్మాన్ షిన్వారీ రిటైర్మెంట్ ప్రకటించారు. దాంతో 12 ఏళ్ల అతడి కెరీర్ ముగిసింది. తాజాగా ఆసిఫ్ అలీ కూడా క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంటే, ఆసియా కప్ ప్రారంభానికి ముందు రెండు ప్రముఖ పాకిస్తాన్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారు.
వివరాలు
శ్రీలంకతో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభం
ఉస్మాన్ షిన్వారీ 2013లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించారు. తర్వాతి వన్డే, టెస్ట్ మ్యాచ్‌లలో కూడా అతను అరంగేట్రం చేసింది. పాకిస్తాన్ తరపున మొత్తం 17 వన్డేలు, 16 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఉస్మాన్ 34, 13 వికెట్లు పడగొట్టారు. డిసెంబర్ 2019లో పాకిస్తాన్ తరపున ఆడిన ఏకైక టెస్ట్ మ్యాచ్ అతని చివరి టెస్ట్‌గా నిలిచింది. 31 ఏళ్ల ఉస్మాన్ 12 ఏళ్ల కాలంలో పాకిస్తాన్ కోసం 34 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. 2018లో ఆసియా కప్ వన్డే జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన రెండు వన్డేల్లో అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 5-34, 5-51 వికెట్లతో జరిగింది.
వివరాలు
నాలుగు సంవత్సరాల తర్వాత వన్డేల్లో..
ఉస్మాన్ షిన్వారీ 2021లో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 2019లో రావల్పిండిలో శ్రీలంకతో జరిగిన టెస్ట్‌లో వర్షం కారణంగా కేవలం 15 ఓవర్లలో ఒకే వికెట్ మాత్రమే సాధించాడు. ఆ తర్వాత జట్టులో తిరిగి ఎంపిక కాలేదు. 2013లో టీ20లో అరంగేట్రం చేసిన ఉస్మాన్, నాలుగు సంవత్సరాల తర్వాత వన్డేల్లో ఆడే అవకాశం పొందారు. తరువాత రెండు సంవత్సరాల పాటు టెస్ట్ మ్యాచ్‌లలో పాల్గొన్నారు.