
Asia Cup 2025: ఆసియా కప్ 2025.. టీమిండియా తొలి మ్యాచ్‌కు ఫైనల్ XI సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా తొలి మ్యాచ్ కోసం సిద్దంగా ఉంది. దుబాయ్‌లో ఈ రాత్రి 8 గంటలకు యూఏఈతో భారత్ తలపడనుంది. సెప్టెంబర్ 14కై సన్నాహకంగా వాడుకోవాలని చూస్తున్న భారత్‌కు తుది జట్టు ఎంపిక కీలకంగా ఉంది. ఈసారి దుబాయ్ పిచ్ స్పిన్, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఎలా స్పందిస్తుందో కూడా ఆసక్తికరంగా మారింది. ఈ టోర్నీలో గేమ్ ఛేంజర్‌గా ఎవరు ఉండబోతున్నారో బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వెల్లడించారు. ఆయన టీమ్‌ఇండియా ఫైనల్ XIపై హింట్ ఇచ్చారు. మోర్నీ మోర్కెల్ వ్యాఖ్యల ప్రకారం, "ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత పిచ్ స్పందించే తీరు మారిపోయే అవకాశం ఉంది. ఇక్కడ అనేక మ్యాచులు ఆడినట్టుగా అనిపిస్తోంది.
Details
స్పష్టమైన ప్రణాళికతో ఉన్నాం
మ్యాచ్‌కు ముందు పిచ్ సర్ఫేస్‌ను చూసి అంచనా వేస్తాం. కొద్దిగా పచ్చిక ఉందని తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో ఎలా బరిలోకి దిగాలో స్పష్టమైన ప్రణాళికతో ఉన్నాం. అన్ని విభాగాలను కవర్ చేసేలా తుది జట్టు ఉండనుంది. అదనంగా పేసర్‌నా లేదా స్పిన్నర్‌నా అనే నిర్ణయం మ్యాచ్ ముందు తీసుకుంటాం. అయితే గేమ్ ఛేంజర్‌గా కుల్‌దీప్ యాదవ్ పేరు చెప్పగలను. అతను కెరీర్‌లో ఎన్నో ఓవర్లు వేశాడు, టీ20లకు సన్నద్ధత తెలుసు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతను ప్రత్యేక బౌలర్. ఎప్పుడైనా ఛాన్స్ వచ్చినా నిరూపించడానికి సిద్ధంగా ఉన్న ప్రొఫెషనల్ అథ్లెట్" అని పేర్కొన్నారు.
Details
ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు తీసుకొనే అవకాశం
తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లకు చోటు ఖాయం అని కనిపిస్తోంది. స్పిన్ ఆల్‌రౌండర్ కోటాలో అక్షర్ పటేల్ ఉంటారు. మరో ఇద్దరు స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్ అవకాశం ఎక్కువ. జస్‌ప్రీత్ బుమ్రాతోపాటు అర్ష్‌దీప్ లేదా హర్షిత్ రాణాలో ఒకరినే తుది జట్టులో ఆడించవచ్చు. పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్య ఖాయం. దీనివల్ల నాలుగు బౌలర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లు, ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు తీసుకోవడానికి టీమిండియాకు సరైన వెసులుబాటు ఏర్పడుతుంది.