
Asia Cup: ఆసియాకప్'లో బంగ్లా శుభారంభం.. హాంకాంగ్‌పై విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. గురువారం జరిగిన గ్రూప్ బి మ్యాచ్‌లో హాంకాంగ్‌ను 7 వికెట్ల తేడాతో సులభంగా ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్ జట్టు 7 వికెట్లకు 143పరుగులు చేసింది. హాంకాంగ్ తరఫున నిజాకత్ ఖాన్ 40 బంతుల్లో 42పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. జీషన్ అలీ 34 బంతుల్లో 30 పరుగులు, యాసిమ్ ముర్తజా 19బంతుల్లో 28 పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ ద్వారా హాంకాంగ్ జట్టును నిరోధించారు. ముఖ్యంగా తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్,రిషాద్ హస్సేన్ ప్రతి ఒక్కరూ 2 వికెట్లు పడగొట్టారు. దీంతో హాంకాంగ్ మొత్తం 13 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి కేవలం 78 పరుగులే చేసింది.
వివరాలు
17.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన బంగ్లాదేశ్
ఆ దశలో కెప్టెన్ యాసిమ్ ముర్తజా ధాటిగా ఆడి ఇన్నింగ్స్‌కు కాస్త ఊపుతెచ్చాడు. లక్ష్యాన్ని బంగ్లాదేశ్ జట్టు 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకంగా చేరుకుంది. కెప్టెన్ లిటన్ దాస్ (59 పరుగులు 39 బంతుల్లో 6 ఫోర్లు,1 సిక్స్),హృదోయ్ (35 నాటౌట్; 36 బంతుల్లో 1×4) మెరిశారు.ఈ జంట మూడో వికెట్‌కు 95 పరుగుల ఘన భాగస్వామ్యాన్ని కూడా నిర్మించింది. సంక్షిప్త స్కోర్లు... హాంకాంగ్: 143/7 (నిజాకత్ ఖాన్ 42, జీషన్ అలీ 30,యాసిమ్ ముర్తజా 28,బాబర్ హయత్ 14; తంజిమ్ హసన్ 2/21, రిషాద్ హస్సేన్ 2/31, తస్కిన్ 2/38); బంగ్లాదేశ్: 144/3 (లిటన్ దాస్ 59, హృదోయ్ 35 నాటౌట్, పర్వేజ్ 19; అతీఖ్ 2/14)