Page Loader
Asian Games 2023: ఆసియా గేమ్స్‌లో గ్రూప్‌ 'ఎ' లో చోటు దక్కించుకున్న భారత్
గ్రూప్ లో చోటు దక్కించుకున్న భారత ఫుట్ బాల్ జట్టు

Asian Games 2023: ఆసియా గేమ్స్‌లో గ్రూప్‌ 'ఎ' లో చోటు దక్కించుకున్న భారత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 27, 2023
06:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఆసియా గేమ్స్ ఫుట్‌ బాల్ డ్రా ను గురువారం తీశారు. ఇందులో భారత పురుషుల జట్టు 'ఏ' లో చోటు దక్కించుకోగా.. మహిళల జట్టు గ్రూప్ లో స్థానం సంపాదించుకుంది. ఇదే గ్రూప్‌లో చైనీస్ తైపీ, థాయ్‌లాండ్ దేశాలున్నాయి. ఆసియా గేమ్స్ పోటీలు 23 తేదీ ప్రారంభం అవుతుండగా, ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 9న నిర్వహించనున్నారు. భారత ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ గా సునీల్ ఛెత్రీ వ్యవహరించనున్నారు. భారత క్రీడా మంత్రిత్వ శాఖ మంత్రి కఠినమైన నిబంధనలను పెట్టడంతో మొదట్లో ఆసియా గేమ్స్ భారత జట్టు ఆడడం సందేహంగా ఉండేది.

Details

వరుస విజయాలతో జోరుమీద ఉన్న భారత ఫుట్ బాల్ జట్టు

అయితే ర్యాంకు విషయంలో క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ మినహాయింపు ఇవ్వడంతో భారత ఫుట్ బాల్ జట్టుకు లైన్ క్లీయర్ అయింది. ఆసియా ఫుట్ బాల్ కాన్ఫిడెరేషన్ నేడు రెండోసారి ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్స్ డ్రాను రిలీజ్ చేసింది. దీంతో భారత పురుషుల జట్టు ఏ గ్రూప్ లో నిలిచింది. ఇదే గ్రూపులో ఖతార్, కువైట్ జట్లు ఉన్నాయి. ఈ మధ్య వరుస విజయాలతో భారత ఫుట్ బాల్ మంచి జోరు మీద ఉంది. స్వదేశంలో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్, శాఫ్ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలవడంతో, భారత్ వరల్డ్ కప్ కు అర్హత సాధించింది.