Asian Games 2023: నేపాల్‌పై విజయం.. సెమీస్‌కు చేరిన భారత జట్టు
ఆసియా గేమ్స్ లో భాగంగా నేపాల్‌తో జరిగిన టీ20 మ్యాచులో భారత పురుషుల జట్టు విజయం సాధించింది. నేపాల్ పై 23 పరుగుల తేడాతో విజయం సాధించి, సెమీస్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రుతురాజ్ సేన 202/4 స్కోరు చేసింది. యశస్వీ జైస్వాల్ 49 బంతుల్లో (8 ఫోర్లు, 7 సిక్స్‌లు) 100 పరుగులు చేసి విజృంభించాడు. చేధనకు దిగిన నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 179 రన్స్ మాత్రమే చేసింది. నేపాల్ బ్యాటర్లలో దీపేంద్ర సింగ్ ఐరీ(32) టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3, రవి బిష్టోయ్ 3, అర్ష్‌దీప్ సింగ్ 2, సాయి కిశోర్ ఒక వికెట్ పడగొట్టాడు.
మూడు వికెట్లను పడగొట్టిన రవి బిష్ణోణ్
నేపాల్ ఈ మ్యాచులో ఓడిపోయినప్పటికీ అద్భుతమైన పోరాట పటిమను కనబరిచింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా భారీ లక్ష్యాన్ని చేధించడానికి ప్రయత్నించారు. ఒకానొక దశలో 11 ఓవర్లకు 77 పరుగులు చేసి నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో నేపాల్ బ్యాటర్లు విజృంభించారు. దీంతో శివం దూబే వేసిన 14వ ఓవర్లలో దిపేంద్ర సింగ్ హ్యాట్రిక్ సిక్సులు కొట్టాడు. ఇక రవి బిష్టోణ్ కీలక సమయంలో మూడు కీలక వికెట్ల తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నేపాల్ బౌలర్లలో దిపేంద్ర సింగ్ రెండు వికెట్లతో ఫర్వాలేదనిపించగా, లమిచానే, కామి తలా ఒక వికెట్ తీశారు.