Loading...
Ashmita Chaliha: కొరియా మాస్టర్స్ ఫైనల్‌కు అస్మిత చాలిహా.. తొలి వరల్డ్ టూర్ టైటిల్‌కు అడుగు దూరంలో!
కొరియా మాస్టర్స్ ఫైనల్‌కు అస్మిత చాలిహా.. తొలి వరల్డ్ టూర్ టైటిల్‌కు అడుగు దూరంలో!

Ashmita Chaliha: కొరియా మాస్టర్స్ ఫైనల్‌కు అస్మిత చాలిహా.. తొలి వరల్డ్ టూర్ టైటిల్‌కు అడుగు దూరంలో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 08, 2026
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత యువ షట్లర్ అస్మిత చాలిహా అద్భుతమైన ఆటతీరుతో దూసుకెళ్తోంది. తన కెరీర్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టోర్నీలోనే ఫైనల్‌కు చేరుకుని సత్తా చాటింది. కొరియా మాస్టర్స్ 300లో భాగంగా జరిగిన సెమీఫైనల్‌లో మరో భారత షట్లర్ రక్షిత రామరాజ్‌ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో అస్మిత 21-13, 16-21, 21-13 తేడాతో రక్షితపై విజయం సాధించింది. తొలి గేమ్‌ను సొంతం చేసుకున్న అస్మితకు రెండో గేమ్‌లో రక్షిత గట్టి పోటీ ఇచ్చింది. దీంతో నిర్ణయాత్మక మూడో గేమ్‌కు మ్యాచ్ వెళ్లింది. అయితే కీలక దశలో అస్మిత తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది.

వివరాలు

ఫైనల్‌కు కియాన్సి హాన్

దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న 26 ఏళ్ల అస్మిత గత మే నెలలోనే తిరిగి కోర్టులో అడుగుపెట్టింది.

పునరాగమనం తర్వాత ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వస్తున్న ఆమె.. అదే జోరును కొనసాగిస్తూ కొరియా మాస్టర్స్ 300లో ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు చైనా షట్లర్ కియాన్సి హాన్ కూడా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.

రెండో సెమీఫైనల్‌లో కొరియా ప్లేయర్ గ్రేస్ కిమ్‌ను హాన్ ఓడించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 22-20, 18-21, 21-14 తేడాతో విజయం సాధించి టైటిల్ పోరులోకి ప్రవేశించింది.

దీంతో ఆదివారం జరిగే కొరియా మాస్టర్స్ 300 ఫైనల్‌లో భారత షట్లర్ అస్మిత చాలిహా, చైనా ప్లేయర్ కియాన్సి హాన్‌తో తలపడనుంది.

ADVERTISEMENT