ASUS ROG ఫోన్ 7, 7 ప్రో ఫోన్స్ వచ్చేశాయి. ధర ఎంతంటే!
సరికొత్త ఫీచర్స్‌తో ASUS ROG ఫోన్ 7, 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్ వచ్చేశాయి. గతేడాది జూలైలో లాంఛ్ అయిన ROG ఫోన్ 6కి ఈ కొత్త మోడల్స్ అప్‌గ్రేడ్ వెర్షన్ అని చెప్పొచ్చు. ఫోన్ 7, 7 ప్రో ఒకేలా కనిపిస్తున్నా.. 7 ప్రోలో అదనపు డిస్ ప్లేతో అద్భుతంగా ఉంది. ROG ఫోన్ 7 సిరీస్ విడుదలకు ఇంకా కొన్ని రోజుల సమయం ఉంది. ఈ ఫోన్ కు సంబంధించిన అదనపు స్పెసిఫికేషన్‌లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ROG ఫోన్ 7, 7 ప్రో ఫ్యూచరిస్టిక్ డిజైన్, టాప్ బెజెల్‌పై సెల్ఫీకెమెరా, డిస్‌ప్లే కింద ఫింగర్‌ప్రింట్ రీడర్‌ను కలిగి ఉన్నాయి. ప్రోమోడల్‌లో వెనకవైపు RGB విజన్ సెకండరీ స్క్రీన్ ఉంది.
ఏప్రిల్ 13న లాంఛ్
హ్యాండ్‌సెట్‌లు 165Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సర్టిఫికేషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.78-అంగుళాలు, HD+ E4 AMOLED దీని ప్రత్యేకత అని చెప్పొచ్చు. ROG ఫోన్ 7 50MP మెయిన్ షూటర్, 13MP అల్ట్రా-వైడ్ స్నాపర్, 5MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ఈ రెండు మోడళ్లలో 12MP సెల్ఫీ కెమెరా ఉండడం గమనార్హం. 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని పొందవచ్చు. ROG ఫోన్ 7 సిరీస్ ధర 47,500 ఉండనుంది. Asus ROG ఫోన్ 7 గ్లోబల్ మార్కెట్‌లలో ఏప్రిల్ 13న ఉదయం 5:30 గంటలకు IST సంస్థ YouTube ఛానెల్ ద్వారా లాంచ్ కానుంది.