Page Loader
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే.. అందరి దృష్టి ఫోగాట్‌పైనే
పారిస్ ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే.. అందరి దృష్టి ఫోగాట్‌పైనే

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే.. అందరి దృష్టి ఫోగాట్‌పైనే

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 07, 2024
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

పారిస్ ఒలింపిక్స్ 2024 మహిళల రెజ్లింగ్‌లో వినేష్ ఫోగాట్ ఫైనల్ కు చేరిన విషయం తెలిసిందే. ఆమె స్వర్ణం గెలవాలని భారత్ అభిమానులు అశిస్తున్నారు. ఒలింపిక్ గేమ్స్‌లో రెజ్లింగ్ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళగా వినేష్ ఫోగట్ ఇప్పటికే చరిత్ర సృష్టించింది. మరో భారత ప్రముఖ భారత రెజ్లర్ అంతిమ్ పంఘాల్ ఫ్రీక్వార్టర్ ఫైనల్లో జైనెప్ యెట్గిల్ తో పోటీపడనుంది. ఇక మహిళల 49 కేజీల వెయిల్ లిఫ్టింగ్ ఈవెంట్లో మరో పతకం సాధించాలని మీరాబాయి గట్టి పట్టుదలతో ఉంది.

Details

పారిస్ ఒలింపిక్స్

అథ్లెటిక్స్ పురుషుల హైజంప్ (క్వాలిఫికేషన్): సర్వేష్ కుషారే - మధ్యాహ్నం 1.35 గంటలకు మహిళల 100 మీటర్ల హర్డిల్స్ (రౌండ్ 1): జ్యోతి యర్రాజీ (హీట్ 4) - మధ్యాహ్నం 1.45 గంటలకు మహిళల జావెలిన్ త్రో (క్వాలిఫికేషన్): అన్ను రాణి - మధ్యాహ్నం 1.55 గంటలకు పురుషుల ట్రిపుల్ జంప్ (క్వాలిఫికేషన్) - రాత్రి 10.45 గంటలకు పురుషుల 3,000 మీటర్ల స్టీపుల్ ఛేజ్ (ఫైనల్): అవినాష్ సాబ్లే - అర్ధరాత్రి 1.13 గంటలకు (ఆగస్టు 8, గురువారం)

Details

 సారా హిల్డెబ్రాండ్ తో పోటీపడనున్న వినేశ్ ఫోగట్ 

మహిళల వ్యక్తిగత (రౌండ్ 1): అదితి అశోక్, దీక్షా డాగర్ - మధ్యాహ్నం 12.30 గంటలకు టేబుల్ టెన్నిస్ మహిళల జట్టు (క్వార్టర్ ఫైనల్): భారత్ (శ్రీజా ఆకుల, మనికా బాత్రా, అర్చన గిరీష్ కామత్) వర్సెస్ జర్మనీ - మధ్యాహ్నం 1.30 గంటలకు రెజ్లింగ్ మహిళల ఫ్రీస్టైల్ 53 కేజీలు - అంతిమ్ పంగల్ - మధ్యాహ్నం 3.05 గంటలకు.. మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీలు (గోల్డ్ మెడల్ మ్యాచ్): వినేశ్ ఫోగట్ వర్సెస్ సారా హిల్డెబ్రాండ్ - రాత్రి 9.45 నుంచి.. వెయిట్ లిఫ్టింగ్ మహిళల 49 కేజీల (మెడల్ రౌండ్): సైఖోమ్ మీరాబాయి చాను - రాత్రి 11.00 గంటలు