Page Loader
Athiya Shetty: బేబీ బంప్‌తో కెమెరాలకు చిక్కిన అతియా శెట్టి
బేబీ బంప్‌తో కెమెరాలకు చిక్కిన అతియా శెట్టి

Athiya Shetty: బేబీ బంప్‌తో కెమెరాలకు చిక్కిన అతియా శెట్టి

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2024
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

హీరోయిన్ అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలో తల్లిదండ్రులు అవుతున్న విషయం తెలిసిందే. ఈ జంట గత నెలలో తమ అభిమానులతో ఈ శుభవార్తను పంచుకుంది. త్వరలో తమ కుటుంబం ముగ్గురుగా మారుతుందని వారు తెలియజేశారు. గర్భం దాల్చినప్పటి నుంచి ఈ జంట మీడియాకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అయితే, తాజాగా అతియా బేబీ బంప్‌తో కెమెరాలకు చిక్కింది. వీడియోలో అతియా తన బేబీ బంప్‌తో కనిపించగా, ఆమె వెనుక అనుష్క శర్మ కూడా ఉండటం గమనార్హం.

Details

ఆస్ట్రేలియాలో అతియా శెట్టి

వీడియోలో అనుష్క శర్మ స్ట్రిప్ టాప్, డెనిమ్ లాంగ్ స్కర్ట్ ధరించి కనిపించగా, అతియా నావీ వైట్, లేత గోధుమరంగు ప్యాంటుతో ఉంది. కేఎల్ రాహుల్, అతియా శెట్టి చాలా సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తరువాత, 2023 జనవరిలో పెళ్లి చేసుకున్నారు. ప్రెగ్నెన్సీ కారణంగా అతియా ప్రస్తుతం తన భర్త కేఎల్ రాహుల్‌తో కలిసి గడుపుతోంది. రాహుల్ ప్రస్తుతం మెల్‌బోర్న్‌లో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో పాల్గొంటుండగా, అతియా కూడా ఆస్ట్రేలియాలో ఉంది. ఆమె అనుష్క శర్మతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు తెలుస్తోంది. అతియా శెట్టి ప్రస్తుతం తన సినిమా కెరీర్‌ను పక్కన పెట్టి, కేఎల్ రాహుల్‌తో తన వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది.