
Badminton coach: బెంగళూరులో దారుణం.. బాలికపై బాడ్మింటన్ కోచ్ అత్యాచారం
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులోని హులిమావు ప్రాంతంలో గల ఓ బాడ్మింటన్ శిక్షణ కేంద్రంలో పని చేస్తున్న కోచ్ సురేష్ బాలాజీ, 16 ఏళ్ల మైనర్ బాలికపై అనేకసార్లు లైంగిక దాడులు చేసిన ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది.
తమిళనాడుకు చెందిన ఈ నిందితుడి ఫోన్‌లో 13-16 ఏళ్ల వయసు గల ఏడుగురు నుంచి ఎనిమిది మంది బాలికల నగ్న ఫోటోలు, వీడియోలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.
బాధిత బాలిక గత రెండేళ్లుగా అదే శిక్షణ కేంద్రంలో బాడ్మింటన్ కోచింగ్ తీసుకుంటోంది.
ఈ క్రమంలో కోచింగ్ ముసుగులో సురేష్ బాలికను పలుమార్లు తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడులకు పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బాలికను బెదిరించినట్టు పోలీసులు తెలిపారు.
Details
నిందితుడిని కస్టడికి తరలించిన పోలీసులు
ఒక సందర్భంలో బాలిక సెలవుల కోసం తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా, ఆమె తన అమ్మమ్మ ఫోన్ ద్వారా కోచ్‌కు నగ్న ఫోటోలు పంపినట్లు గుర్తించారు.
ఈ సందేశాలను గమనించిన బాలిక అమ్మమ్మ, ఆమె తల్లికి తెలియజేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసుల విచారణలో కోచ్ సురేష్ దాదాపుగా 25 సార్లు తనను ఇంటికి తీసుకెళ్లాడని తెలిపింది.
ట్యూషన్ల పేరుతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక, కోచ్ ఇంటికే వెళ్లేదని పోలీసులు పేర్కొన్నారు. బాలికతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
అతడి ఫోన్‌ను పరిశీలించగా, పలు మైనర్ బాలికల అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దాంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, 8 రోజుల కస్టడీకి తీసుకున్నారు.