IND vs AUS: ముగిసిన తొలిరోజు ఆట.. ఆస్ట్రేలియా 311/6
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 26, 2024
12:50 pm
ఈ వార్తాకథనం ఏంటి
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 311/6 పరుగులతో నిలిచింది. స్టీవెన్ స్మిత్ (68*), కమిన్స్ (8*) క్రీజులో ఉన్నారు. సామ్ కాన్‌స్టాస్ 60 పరుగులు, ఉస్మాన్ ఖవాజా 57 పరుగులు, మనస్ లబుషేన్ 72 పరుగులు, అలెక్స్ కేరీ 31 పరుగులు చేశారు. మార్ష్ కేవలం 4 పరుగులు చేయగా, ట్రావిస్ హెడ్ డకౌట్ అయ్యారు. భారత బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా 3 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్ తలో వికెట్ పడగొట్టారు.