బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: వార్తలు

26 Mar 2024

క్రీడలు

IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 -25 షెడ్యూల్ విడుదల.. అడిలైడ్‌లో డే నైట్ టెస్ట్ 

ఇండియా- ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగే ఐదు టెస్టు మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ జరుగనుంది.

IND vs AUS:: ప్లేయర్స్ ఆఫ్ ది సిరీస్‌గా అశ్విన్, జడేజా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఆహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగిసింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో దక్కించుకుంది.

IND vs AUS: పాపం ట్రావిస్ హెడ్.. సెంచరీ మిస్

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌లో బాగా రాణించాడు. హెడ్ (163 బంతుల్లో 90; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.

గుడ్‌న్యూస్.. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు టీమిండియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో ఫలితం లేకుండానే టీమిండియా గుడ్‌న్యూస్ అందింది. క్రైస్ట్ చర్చ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో శ్రీలంకను న్యూజిలాండ్ ఓడించడంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్‌కు టీమిండియా అర్హత సాధించింది.

IND vs AUS: గిల్ సెంచరీ, కోహ్లీ హాఫ్ సెంచరీ.. రాణిస్తున్న బ్యాటర్లు

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత బ్యాటర్లు రాణిస్తున్నారు.

ఆస్ట్రేలియాపై మరో ఫీట్‌ను సాధించిన పుజారా

భారత వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అరుదైన ఘనతను సాధించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఈ మైలురాయిని అందుకున్నాడు.

IND VS AUS: ఉస్మాన్ ఖావాజా వీర విజృంభణ

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్టులో ఉస్మాన్ ఖావాజా చెలరేగిపోయాడు. 422 బంతుల్లో 180 (21 ఫోర్లు) పరుగులు చేసి సత్తా చాటాడు. దీంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 450 మార్కును దాటింది.

IND vs AUS: సెంచరీతో మెరిసిన కామెరాన్ గ్రీన్

భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఆస్ట్రేలియా పట్టు సాధించింది. అహ్మదాబాద్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు చక్కగా రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి రోజు ఆటలో నాలుగు వికెట్లు కోల్పోయిన విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌కి మాతృవియోగం

ఆస్ట్రేలియా క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి మరియా ఈ రోజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సిడ్నీలో తుదిశ్వాస విడిచారు.

IND vs AUS : మొదటి రోజు సెంచరీతో కదం తొక్కిన ఉస్మాన్ ఖావాజా

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా అధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి రోజు ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగారు.

IND vs AUS : చివరి టెస్టుకు హజరైన ప్రధానమంత్రులు మోడీ, ఆంటోని ఆల్బనీస్

భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా గురువారం నుంచి ప్రారంభమైన చివరి టెస్టుకు ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ హజరయ్యారు.

IND vs AUS: బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

IND vs AUS: ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియా రెడీ

ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చోటు దక్కాలంటే టీమిండియా చివరి టెస్టు నెగ్గాల్సిందే. మార్చి 9 ఆస్ట్రేలియా-ఇండియా మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో టీమిండియా ఉంది. మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

IND vs AUS: ఆహ్మదాబాద్ టెస్టులో రాహుల్-గిల్‌ని ఆడించాలి : రికి పాటింగ్

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ టీమిండియా వెళ్లాలంటే నాలుగో టెస్టును తప్పక గెలవాలి. అయితే తుది జట్టుపై టీమిండియా తర్జనభర్జనలను పడుతోంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య మార్చి 9న నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్టులో విఫలమైన రాహుల్‌ను తప్పించి, యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కి అవకాశం కల్పించింది. మూడో టెస్టులో గిల్ పూర్తిగా నిరాశపరిచాడు.

WTC: వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా

ఇండోర్ టెస్టు గెలిచి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలని టీమిండియా ప్రయత్నించింది. కానీ ఈ పోరులో ఆస్ట్రేలియా గెలిచి తొలుత చోటు దక్కించుకుంది. రెండు టెస్టులలో ఘోర ఓటముల తర్వాత పుంజుకున్న ఆస్ట్రేలియా.. మూడో టెస్టులో టీమిండియా ని 9 వికెట్ల తేడాతో ఓడించింది.

జడేజా, అశ్విన్‌ సమక్షంలో స్వదేశంలో భారత్ రెండు టెస్టు ఓటములు

భారత్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం సిరీస్‌ 2-1తో భారత్‌ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ముందంజలో ఉంది. మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించిన ఆసీస్ అద్భుత ప్రదర్శన కనభరిచింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో కలిసి స్వదేశంలో ఇంతవరకూ భారత్ రెండు టెస్టులను ఓడిపోవడం గమనార్హం.

IND vs AUS: పుజారాపై ప్రశంసలు కురిపించిన ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత స్టార్ బ్యాట్‌మెన్ చతేశ్వర్ పుజారా అద్భుతంగా రాణించాడని ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ ప్రశంసించాడు. ఇండోర్ వేదికగా ఒకవైపు వికెట్లు కోల్పోతున్న మరో ఎండ్‌లో టీమిండియాను స్కోరును పుజారా కదిలించాడు.

IND vs AUS : టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న ఆస్ట్రేలియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. రెండు టెస్టులో దారుణంగా ఓడిన ఆస్ట్రేలియా.. మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి లక్ష్యాన్ని చేధించింది.

IND vs AUS: కష్టకాలంలో భారత జట్టును అదుకున్న పుజారా

టీమిండియా టెస్టు స్టార్ బ్యాట్‌మెన్ చతేశ్వర్ పుజారా కష్టకాలంలో భారత జట్టును అదుకున్నాడు. ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో పుజారా అర్ధ శతకంలో రాణించారు. ఒకవైపు వికెట్లు కోల్పోతున్నా తాను మాత్రం ఒక ఎండ్‌లో నిలబడి టీమిండియా స్కోరును కదిలించాడు.

IND vs AUS: 8 వికెట్లతో నాథన్ లియాన్ విశ్వరూపం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓటమి దిశగా సాగుతోంది. ఇండోర్‌లోని హెల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియన్ స్పిన్నర్ 8 వికెట్లు తీయడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 163 పరుగులకు అలౌటైంది. దీంతో ఆసీస్‌కు 76 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

IND vs AUS: స్వదేశంలో ఉమేష్ యాదవ్ అరుదైన రికార్డు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వెటరన్ పేసర్ ఉమేష్ యాదవ్ సంచలన రికార్డును సృష్టించాడు. స్వదేశంలో ఆడిన టెస్టులో 100 వికెట్లు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.

Indore Test: 11 పరుగుల వ్యవధిలో ఆరుగురు ఔట్.. ఆసీస్ 197 ఆలౌట్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్ విజృభించడంతో 11 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు తీశారు. ఓ దశలో 186/4తో భారీ స్కోరు దిశగా సాగుతున్న ఆసీస్, ఈ ఇద్దరి దెబ్బకు కుప్పకూలింది.

IND vs AUS: ఆస్ట్రేలియా స్పిన్నర్ల దెబ్బకు 109 పరుగులకే టీమిండియా ఆలౌట్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా కుప్పకూలింది. వరుసగా రెండు టెస్టులో ఆసీస్ ను ఓడించిన భారత్.. మూడో టెస్టులో మాత్రం తేలిపోయింది.

IND vs AUS : ముగ్గురు స్పిన్నర్లతో ఆడించడం అనవసరం

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య టెస్టు వార్ ఫ్యాన్స్‌కు మజానిస్తోంది. ప్రస్తుతం ఈ ట్రోఫీలో భాగంగా రెండు టెస్టులో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు తేలిపోయారు. దీంతో టీమిండియా 2-0 అధిక్యంలో నిలిచింది.

ఆస్ట్రేలియాకు గుడ్‌న్యూస్.. మూడో టెస్టుకు కామెరాన్ గ్రీన్ సిద్ధం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గాయంతో మొదటి రెండు మ్యాచ్ లకు కామెరాన్ గ్రీన్ దూరమయ్యాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా మూడో టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. మూడో టెస్టు కోసం తాను వందశాతం ఫిట్‌గా ఉన్నానని ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ చెప్పాడు.

మూడో టెస్టుపై గురి పెట్టిన టీమిండియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భారత్ వర్సస్ ఆస్ట్రేలియా మధ్య ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా 2-0లో అధిక్యంలో నిలిచింది. మార్చి 1 ఈ టెస్టు మ్యాచ్ జరుగుతుంది.

ఆస్ట్రేలియాకు కోలుకోలేని ఎదురుదెబ్బ.. స్టార్ పేసర్ దూరం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 ఆడేందుకు భారత్‌లో పర్యటిస్తున్న ఆసీస్ ఇప్పటికే రెండో టెస్టులో ఓటమిపాలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుకు గాయాల బెడద ఎక్కువ అవుతోంది. ఇప్పటికే తొలి రెండు టెస్టులకు స్టార్ పేసర్లు మిచెల్‌స్టార్క్, జోష్‌హేజిల్‌వుడ్ దూరం కాగా.. తాజాగా అందించిన సమాచారం మేరకు హేజిల్ వుడ్ సిరీస్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలిసింది.

IND vs AUS, 2nd Test: విరాట్‌ కోహ్లి ఔట్‌పై రాజుకున్న వివాదం

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీ ఔట్‌పై ప్రస్తుతం వివాదం రాజుకుంది. ఢిల్లీ టెస్టులో విరాట్ కోహ్లీ వివాదాస్పదరీతిలో ఔటయ్యాడు. బంతికి బ్యాట్‌కి తాకి అనంతరం ఫ్యాడ్‌కి తాకినట్లు రిప్లైలో కనిపిస్తున్నా కోహ్లీ ఔట్ అంటూ ప్రకటించారు. దీనిపై థర్డ్ ఆంపైర్ కూడా స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోవడం గమనార్హం.

ఆస్ట్రేలియాకు భారీ షాక్.. రెండో టెస్టుకు వార్నర్ దూరం

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా రెండు టెస్టు నుండి తప్పుకున్నాడు.

IND vs AUS: అశ్విన్, జడేజా సూపర్.. ఆస్ట్రేలియా ఆలౌట్

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడీయం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 78.4 ఓవర్లలలో 263 పరుగులు చేసింది.

రెండో టెస్టులో రికార్డులను సాధించిన భారత స్పిన్నర్లు

ఢిల్లీ వేదికగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్లు జడేజా, రవిచంద్రన్ అశ్విన్ పలు రికార్డులను సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్ లో సీనియర్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా కూడా ఓ అరుదైన ఘనతను సాధించాడు.

ముగ్గురు ఆఫ్ స్పిన్నర్లతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ఢిల్లీలో మొదలైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు స్వల్ప మార్పులతో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా మ్యాట్ రెన్ షా స్థానంలో ట్రావిస్ హెడ్ ను జట్టులోకి తీసుకుంది. బోలాండ్ స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ మ్యాథ్యూ కున్మెన్ కు ప్లేస్ దక్కింది. టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ స్థానంలో గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్‌కి తుది జట్టులో అవకాశం కల్పించారు.

ఆసీస్ ఓటమిపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన కారణంగా టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఆసీస్ చెత్త రికార్డులను మూటగట్టుకుంది.

భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్ట్ వేదిక మార్పు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్‌కు ఆదిరిపోయే ఆరంభం లభించింది. నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 132 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. ఫిబ్రవరి 17న ఢిల్లీ వేదికగా ఆసీస్‌తో రెండో టెస్టు ఆడనుంది. కాగా ధర్మశాల వేదికగా మూడో టెస్టు జరగాల్సి ఉండగా.. ప్రస్తుతం బీసీసీఐ వేదికను మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

విజృంభించిన స్పిన్నర్లు, మొదటి టెస్టులో టీమిండియా ఘన విజయం

తొలిటెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. స్పిన్ ఆడటంతో మరోసారి తమ బలహీనతను ఆస్ట్రేలియా బ్యాటర్లు బయటపెట్టుకున్నారు. దీంతో కంగారులు మూడో రోజుకే చాప చుట్టేశారు. భారత స్పిన్నర్లు విజృంభించడంతో ఆస్ట్రేలియా ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.

రాణించిన అక్షర్, టీమిండియా 400 పరుగులకు ఆలౌట్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 400 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే కుప్పకూలింది.

ధర్మశాలలో మూడో టెస్టు జరగడం అనుమానమే..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియా-ఇండియా మధ్య మొదటి టెస్టు వైభవంగా ప్రారంభమైంది. అయితే మూడో టెస్టు ధర్మశాలలో జరగాల్సి ఉండగా.. దీనిపై క్లారిటీ రావడం లేదు.

మొదటి టెస్టులో రాణించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ లబుషాగ్నే

నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్టు జరిగింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా టపటపా వికెట్లను కోల్పోయింది.

టెస్ట్ క్యాప్ అందుకున్న కేఎస్ భరత్

నాగ్ పూర్ వేదికగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు టీమిండియా తుది జట్టులో ఆంధ్రా కుర్రాడు కేఎస్.భరత్ చోటు దక్కించుకున్నాడు. భరత్‌కు టీమిండియా క్రికెటర్ల సమక్షంలో టెస్ట్ క్యాప్‌ను సీనియర్ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా అందజేశారు.

బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, టెస్టుల్లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్, భరత్

స్వదేశంలో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలంటే భారత్‌కి కనీసం మూడు విజయాలు కావాలి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

టీ20 నెం.1 ప్లేయర్‌కి టెస్టులోకి చోటు దక్కేనా..?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో ఆస్ట్రేలియాను ఓడిస్తేనే భారత్ ఐసీసీ డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. ఈ సిరీస్‌లోని మొదటి టెస్టు నాగ్‌పూర్ లోని VCA స్టేడియంలో ప్రారంభం కానుంది.ఇండియా స్వదేశంలో 2017లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మొదటి టెస్టు ఆడే ప్లేయర్స్ ఎంపికలో టీమిండియా ఆచూతూచి వ్యవరిస్తోంది.

భయపడేది లేదు, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై టీమిండియా కాన్ఫిడెన్స్

ప్రపంచ క్రికెట్లో రెండు అత్యుత్తమ జట్లు టెస్టులో తలపడితే అభిమానులకు అంతకుమంచి కిక్ ఏముంటుంది. ఉత్కంఠభరిత సమరాలకు వేదికగా నిలిచే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రేపటి నుంచి ప్రారంభం కానుంది.