India vs Australia: తొలి టెస్టులో మొదటి రోజు ముగిసిన ఆట.. ఆసీస్ ఏడు వికెట్లు డౌన్..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు భారత్ ఆధిక్యంలో కొనసాగుతోంది. బ్యాటింగ్‌లో భారత జట్టు ఆశించినంతగా రాణించలేదు. బౌలింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 150 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. అరంగేట్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (41) టీమిండియాలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించగా, భారత పేసర్లు ఆస్ట్రేలియాకు వరుస షాక్‌లు ఇచ్చారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 7 వికెట్ల నష్టంతో 67 పరుగులు చేసింది. అలెక్స్ కెరీ (19), మిచెల్ స్టార్క్ (6) క్రీజులో ఉన్నారు.
83 పరుగుల వెనుకంజలో ఆసీస్
భారత బౌలర్లు బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణా తమ అద్భుత ప్రదర్శనతో ఆసీస్ బాటర్లను కకట్టడి చేశారు. బుమ్రా 4 వికెట్లు , సిరాజ్ 2, హర్షిత్ రాణా 1 వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇంకా 83 పరుగుల వెనుకంజలో ఉంది. బుమ్రా ప్రత్యేకంగా ఖవాజా, స్మిత్, మెక్‌స్వీనీ, కమిన్స్ వంటి ఆటగాళ్లను త్వరగా ఔట్ చేసి, జట్టు ఆధిపత్యాన్ని పెంచాడు. భారత బ్యాటర్లలో నితీశ్ కుమార్ రెడ్డి (41),పంత్ (37),కేఎల్ రాహుల్ (26),ధ్రువ్ జురెల్ (11) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. యశస్వి జైస్వాల్,దేవదత్ పడిక్కల్ డకౌట్‌గా అవుటయ్యారు.విరాట్ కోహ్లీ (5),సుందర్ (4),హర్షిత్ రాణా (7),బుమ్రా (8) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లు జోష్ హేజిల్‌వుడ్(4/29),కమిన్స్(2/14),మార్ష్ (2/12),స్టార్క్(2/14) రాణించారు.