IND vs AUS: పుజారాపై ప్రశంసలు కురిపించిన ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత స్టార్ బ్యాట్‌మెన్ చతేశ్వర్ పుజారా అద్భుతంగా రాణించాడని ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ ప్రశంసించాడు. ఇండోర్ వేదికగా ఒకవైపు వికెట్లు కోల్పోతున్న మరో ఎండ్‌లో టీమిండియాను స్కోరును పుజారా కదిలించాడు. ముఖ్యంగా లియోన్ బౌలింగ్‌ను పుజారా సులభంగా ఎదుర్కొన్నాడు. 142 బంతుల్లో 59 పరుగులు చేసి టీమిండియా తరుపున పుజారా రాణించాడు. అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ లెగ్ స్లిప్ వద్ద అద్భుత్ క్యాచ్ పట్టి పుజారాను ఔట్ చేశాడు.
13సార్లు పుజారాను ఔట్ చేసిన నాథన్ లియోన్
పుజారా టెస్టులో అద్భుత ప్రణాళికలతో ఆడే సత్తా ఉందని, గబ్బా, ఇండోర్ ఆడినా అతను ఇబ్బంది పడడని, నైపుణ్యం ఉన్న బ్యాట్ మెన్ పుజారా అని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ చెప్పారు. రివర్స్ స్విప్‌లు, రివర్స్ షాట్లు కాకుండా అద్భుతంగా ఢిపెన్స్ పుజారా చేయగలడయని, తన దృష్టిలో టెస్టు క్రికెట్ అంటే ఢిపెన్స్ చేయడమేనని నాథన్ లియోన్ వివరించారు. నాథన్ లియోన్ టెస్టులో 13 సార్లు పుజారాను ఔట్ చేయడం విశేషం. బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో మూడు సందర్భాల్లో లియోన్ అవుట్ చేసి సత్తా చాటాడు.