AUS vs IND: సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే భారత్ ఆలౌట్.. ఆస్ట్రేలియా 9/1
ఈ వార్తాకథనం ఏంటి
సిడ్నీ టెస్టులో (AUS vs IND) భారత బ్యాటింగ్ మరింత తడబాటుకు గురైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 72.2 ఓవర్లలో కేవలం 185 పరుగులకు ఆలౌటైంది.
ఈ ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ 40, రవీంద్ర జడేజా 26, జస్‌ప్రీత్ బుమ్రా 22, శుభ్‌మన్ గిల్ 20, విరాట్ కోహ్లీ 17, వాషింగ్టన్ సుందర్ 14, యశస్వి జైస్వాల్ 10 పరుగులు చేశారు.
నితీష్ డకౌట్ అయ్యారు, కాగా కేఎల్ రాహుల్ 4 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4 వికెట్లు, మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, కమిన్స్ 2 వికెట్లు, నాథన్ లైయన్ 1 వికెట్ సాధించారు.
వివరాలు
స్లిప్‌లో సూపర్ క్యాచ్ పట్టిన కేఎల్ రాహుల్
తొలి రోజు ఆట ముగిసే సమయానికి, ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది.
మరో బంతి పడితే ఇవాళ ఆట ముగుస్తుందనగా.. బుమ్రా అద్భుతమైన డెలివరీతో ఉస్మాన్ ఖవాజా (2) ను పెవిలియన్‌కు పంపించాడు.
కేఎల్ రాహుల్ స్లిప్‌లో సూపర్ క్యాచ్ పట్టి ఖవాజాను అవుట్ చేశాడు.
ఆ సమయంలో బుమ్రాతో కొన్‌స్టాస్ (7*) వాగ్వాదానికి దిగినప్పటికీ, అంపైర్, ఖవాజా కలిసి ఆ వివాదాన్ని పరిష్కరించారు.
కానీ, చివరి బంతికి వికెట్ పడటంతో భారత ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
5వ టెస్ట్ లో ముగిసిన తొలిరోజు ఆట
Jasprit Bumrah removes Usman Khawaja to hand India a breakthrough on the final ball of the day 👊#WTC25 | 📝 #AUSvIND: https://t.co/KKLsgkcy4j pic.twitter.com/DIYWhpPOIp
— ICC (@ICC) January 3, 2025