IND vs AUS 2024: ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరం?
ఆస్ట్రేలియాతో కీలకమైన టెస్టు సిరీస్ సమీపిస్తున్న నేపథ్యంలో భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నవంబరులో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఆడటానికి ఆస్ట్రేలియా గడ్డకి వెళ్లనున్న భారత్.. అక్కడ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడనుంది. అయితే, ఈ సిరీస్‌లో ఒక టెస్టుకు తాను అందుబాటులో ఉండనని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి రోహిత్ శర్మ సమాచారం అందించాడు.
రెండింటిలో ఒకటికి దూరం
నవంబర్ 22 నుంచి పెర్త్‌లో భారత్,ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. కానీ,ఈ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండనున్నాడు.వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ శర్మ పెర్త్ టెస్టుకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ఒకవేళ పెర్త్ టెస్టు ఆడితే,అడిలైడ్‌లో డిసెంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే రెండో మ్యాచ్‌కు కూడా దూరమవుతాడని బీసీసీఐ వెల్లడించింది. అయితే, స్పష్టమైన కారణాల్ని మాత్రం వివరించలేదు.మొదటి రెండు టెస్టుల్లో ఒక్క మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ ఆడడు అనే విషయాన్నిబీసీసీఐ క్లారిటీగా వెల్లడించింది. 2014-15నుండి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు మెరుగైన ప్రదర్శన చూపిస్తూ కంగారూలకు చుక్కలు చూపిస్తోంది. ఈనేపథ్యంలో రోహిత్ శర్మ లాంటి ఆటగాడు ఆరంభ మ్యాచ్‌లకు దూరమవడం భారత్ జట్టుకు ఇబ్బందే.
ఓపెనర్లుగా ఎవరు?
సిరీస్ ప్రారంభానికి ముందే వ్యక్తిగత సమస్యలు పరిష్కారమైతే, అతడు మొత్తం ఐదు టెస్టులు ఆడగలడు. రాబోయే రోజుల్లో దీని గురించి మాకు మరింత సమాచారం అందుతుందని బీసీసీఐ తెలిపింది. ఇటీవల బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో 2-0తో చిత్తు చేసిన భారత్ టెస్టు జట్టు, అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. ఈ మేరకు ఇప్పటికే న్యూజిలాండ్ టెస్టు జట్టును ప్రకటించారు. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడకపోతే, అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి తీసుకోవచ్చు. అయితే, ఓపెనర్లుగా శుభమన్ గిల్, యశస్వి జైశ్వాల్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇద్దరిలో ఒకరిని తప్పిస్తే, కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా ఆడించబడవచ్చు.
భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ పూర్తి షెడ్యూల్
మొదటి టెస్టు: నవంబర్ 22-26 (పెర్త్ స్టేడియం, పెర్త్) రెండో టెస్టు: డిసెంబర్ 6-10 (అడిలైడ్ ఓవల్, అడిలైడ్) మూడో టెస్టు: డిసెంబర్ 14-18 (గబ్బా, బ్రిస్బేన్) నాలుగో టెస్టు: డిసెంబర్ 26-30 (మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్‌బోర్న్) ఐదో టెస్టు: జనవరి 3-7 (సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ)
టెస్టు టీమ్ ప్రకటన ఆలస్యం
ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం కాస్త ఆలస్యంగా భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. ఇంకా న్యూజిలాండ్‌తో తలపడే జట్టును కూడా బీసీసీఐ ప్రకటించలేదు. ప్రస్తుతం భారత టీ20 జట్టు బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడుతుండగా, టెస్టు టీమ్ విశ్రాంతి తీసుకుంటోంది.