బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, టెస్టుల్లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్, భరత్
స్వదేశంలో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలంటే భారత్‌కి కనీసం మూడు విజయాలు కావాలి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఆరు టెస్టు మ్యాచ్‌లు జరగ్గా.. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు మూడుసార్లు గెలిచాయి. అయితే ఇక్కడ టీమిండియా ఆడిన ఆరు టెస్టులో నాలుగింటిని గెలిచింది. మ్యాచ్ స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఉదయం 9:30కి ప్రసారం కానుంది. భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటివరకూ 102 టెస్టులో తలపడ్డాయి. ఆస్ట్రేలియా 43 మ్యాచ్‌లు గెలవగా.. టీమిండియా 30 మ్యాచ్‌లను మాత్రమే గెలిచింది.
మొదటి టెస్టులో ఆడనున్న ఇరు జట్ల సభ్యులు వీరే..
ఆస్ట్రేలియా బ్యాటర్ స్మిత్ భారత్‌లో ఆరు టెస్టులు ఆడగా.. మూడు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో 660 పరుగులు చేశాడు. లియాన్ 30.58 సగటుతో 34 వికెట్లు పడగొట్టాడు. పుజారా ఆసీస్‌తో 20 టెస్టుల్లో ఆడి 54.08 సగటుతో 1,893 పరుగులు చేశాడు. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టెస్టుల్లోనూ చోటు దక్కించుకున్నాడు. గాయంతో దూరమైన వికెట్ కీపర్ రిషభ్ పంత్ స్థానంలో భరత్‌కు చోటు లభించింది. వీరద్దరూ మొదటిసారిగా టెస్టులో అరంగేట్రం చేశారు. భారత జట్టు: రోహిత్‌శర్మ (కెప్టెన్), రాహుల్, పుజారా, కోహ్లీ, సూర్యకుమార్, భరత్, జడేజా, అశ్విన్, అక్షర్‌పటేల్, షమీ, సిరాజ్. ఆస్ట్రేలియాజట్టు: వార్నర్, ఖవాజా, లాబుషాగ్నే, స్మిత్, మాట్‌రెన్‌షా, హ్యాండ్‌స్కాంబ్, కారీ, కమిన్స్ (కెప్టెన్), లియోన్, టాడ్‌మర్ఫీ, స్కాట్‌బోలాండ్