Page Loader
IND Vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్‌కు‌ నిరాశ.. రెండో టెస్టులోనూ ఓటమి
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్‌కు‌ నిరాశ.. రెండో టెస్టులోనూ ఓటమి

IND Vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్‌కు‌ నిరాశ.. రెండో టెస్టులోనూ ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2024
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లను సరైన విధంగా ఉపయోగించడం లేదు. ఆస్ట్రేలియాతో సిరీస్ కు ముందు జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ భారత్‌కు పరాజయాలు ఎదురయ్యాయి. మొదటి టెస్టులో సాయి సుదర్శన్ సెంచరీ చేసినప్పటికీ, రెండో టెస్టులో ధృవ్ జురెల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు మినహా ఈ టూర్‌లో గొప్ప ప్రదర్శన ఏమీ కనపడలేదు. శనివారం (నవంబర్ 9) మెల్‌బోర్న్ వేదికగా ముగిసిన రెండవ అనధికారిక టెస్టులో భారత్‌ను ఆసీస్ నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. భారత జట్టు నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి సులభంగా ఛేదించింది.

Details

సత్తా చాటిన ధృవ్ జురెల్, ప్రసిద్ధ కృష్ణ

73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాకు సామ్ కాన్స్టాస్ (73), వెబ్ స్టర్ (46) కీలక భాగస్వామ్యాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 161 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 229 పరుగులకు ఆలౌట్ కాగా, ఆసీస్ 169 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక ఆస్ట్రేలియా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ధృవ్ జురెల్ ఈ సిరీస్‌లో తన రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నాడు, కాబట్టి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అతనికి చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి. అలాగే బౌలింగ్‌లో మెరుపులు మెరిపించిన ప్రసిద్ధ కృష్ణకు కూడా ఛాన్స్ ఉండొచ్చు.