Page Loader
AUS vs IND: డిసెంబర్‌ 26 నుంచి ప్రారంభం బాక్సింగ్‌ డే టెస్టు ప్రారంభం.. ఆటగాళ్ల ముందు కీలక మైలురాళ్లు 

AUS vs IND: డిసెంబర్‌ 26 నుంచి ప్రారంభం బాక్సింగ్‌ డే టెస్టు ప్రారంభం.. ఆటగాళ్ల ముందు కీలక మైలురాళ్లు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 23, 2024
05:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా బాక్సింగ్‌ డే టెస్టుకు టీమిండియా, ఆస్ట్రేలియా సన్నద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల ముందున్న రికార్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా, టీమ్‌ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, ఆసీస్ సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కీలక లక్ష్యాలను చేరేందుకు సమాయత్తమవుతున్నారు. జస్ప్రిత్ బుమ్రా,ఈ టోర్నీలో టీమ్‌ఇండియా పేస్ దళాన్ని విజయవంతంగా ముందుండి నడిపిస్తూ, మరిన్ని వికెట్లు సాధించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఆరు వికెట్లు పడగొట్టినట్లయితే, టెస్టుల్లో 200 వికెట్లు సాధించిన భారత పేసర్ల జాబితాలో స్థానం సంపాదిస్తాడు.

వివరాలు 

స్మిత్ 191 పరుగులు సాధిస్తే టెస్టుల్లో పది వేల పరుగులు

ఇప్పటివరకు ఈ ఘనత కేవలం ఐదుగురు భారత పేసర్లు, కపిల్‌దేవ్‌, ఇషాంత్‌శర్మ, జవగళ్‌శ్రీనాథ్‌, మహ్మద్‌ షమీ తదితరులు మాత్రమే సాధించారు. మొత్తం మీద, భారత బౌలర్లలో 11 మంది మాత్రమే ఈ మైలురాయికి చేరుకున్నారు. బుమ్రా ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా ఈ రికార్డు చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక స్టీవ్ స్మిత్ విషయానికి వస్తే,అతడికి ఇంకో 191 పరుగులు సాధిస్తే టెస్టుల్లో పది వేల పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో చేరుతాడు. ఈ ఘనత సాధిస్తే,అలన్‌ బోర్డర్‌, స్టీవ్‌ వా, రికీ పాంటింగ్‌ల తరువాత నాలుగో ఆస్ట్రేలియా బ్యాటర్‌గా నిలుస్తాడు. గత టెస్టులో ట్రావిస్ హెడ్‌తో కలిసి సెంచరీ చేసిన స్మిత్‌కి ఈ లక్ష్యం చేరడం కష్టమేమీ కాదు.

వివరాలు 

మూడో టెస్టు డ్రా.. టోర్నీలో ఉత్కంఠ

2014లో ఇదే మెల్‌బోర్న్ మైదానంలో స్మిత్ 192 పరుగులతో భారత్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతిని గుర్తించాలి. డిసెంబర్‌ 26 నుంచి ప్రఖ్యాత మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకు అత్యంత కీలకమైంది, ఎందుకంటే ప్రస్తుతం రెండు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. మూడో టెస్టు డ్రాగా ముగియడం టోర్నీలో ఉత్కంఠను మరింత పెంచింది.