Page Loader
AUS vs IND: భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌.. 13 మందితో ఆసీస్ జట్టు ప్రకటన 
భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌.. 13 మందితో ఆసీస్ జట్టు ప్రకటన

AUS vs IND: భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌.. 13 మందితో ఆసీస్ జట్టు ప్రకటన 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2024
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ పర్యటన కోసం ఆస్ట్రేలియా జట్టు సిద్ధమవుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌ నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. పెర్త్‌లో జరగనున్న తొలి టెస్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా 13 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆసీస్ జట్టులోకి నూతన ఆటగాడు నాథన్ మెక్‌స్వీనే మొదటి టెస్టుకు ఎంపికయ్యాడు. భారత్-ఏతో జరిగిన అనధికారిక టెస్టుల సిరీస్‌లో మంచి ప్రదర్శనతో మెక్‌స్వీనే ఆసీస్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కామెరూన్ గ్రీన్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. టీమిండియా జట్టును ఇప్పటికే ప్రకటించారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టులో ఆడతారా లేదా అనే సందేహం ఇంకా కొనసాగుతోంది.

Details

ఆసీస్ జట్టు ఇదే

ఆసీస్-ఏపై సీరీస్‌లో ధ్రువ్ జురెల్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నందున, అభిమానులు కేఎల్ రాహుల్ స్థానంలో జురెల్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనే, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్

Details

టీమిండియా జట్టు ఇదే

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.