Indore Test: 11 పరుగుల వ్యవధిలో ఆరుగురు ఔట్.. ఆసీస్ 197 ఆలౌట్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్ విజృభించడంతో 11 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు తీశారు. ఓ దశలో 186/4తో భారీ స్కోరు దిశగా సాగుతున్న ఆసీస్, ఈ ఇద్దరి దెబ్బకు కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా 197 పరుగుల వద్ద ఆలౌటైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 87 పరుగుల అధిక్యంలో నిలిచింది. ఆసీస్ కు రెండో రోజు బ్యాటర్లు పీటర్ హ్యాండ్స్ కోంబ్ (19), కామెరూన్ గ్రీన్ (21) మంచి ఆరంభమే ఇచ్చినా హ్యాండ్ కోబ్ ను ఔట్ చేసి ఆశ్విన్ భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. మరోవైపు పేసర్ ఉమేష్ యాదవ్ చెలరేగిపోయాడు.
పెవిలియానికి క్యూ కట్టిన ఆస్ట్రేలియా బ్యాటర్లు
ఆస్ట్రేలియా టెస్టు చరిత్రలో అత్యంత దారుణమైన పతనాన్ని చవిచూసింది. కేవలం 11 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. అలెక్స్ కారీ (3), స్టార్క్ (1), లియాన్ (5), మర్ఫీ (0), మాథ్యూ కుహ్నెమాన్ (0) సింగిల్ డిజిట్‌కే వెనుతిరిగారు. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విరాట్ కోహ్లీ (22), శుభ్‌మన్ గిల్ (21) మాత్రమే 20కి పైగా స్కోరు చేయగా.. మాథ్యూ కుహ్నెమాన్ (5/16), టాడ్ మర్ఫీ (1/23), నాథన్ లియాన్ (3/35) భారత బ్యాటర్లను పెవిలియానికి పంపారు. తొలిరోజు ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్‌చాగ్నే, ఉస్మాన్ ఖవాజా, స్టీవెన్ స్మిత్‌లను అవుట్ చేసి రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీశాడు.