Page Loader
IND vs AUS:: ప్లేయర్స్ ఆఫ్ ది సిరీస్‌గా అశ్విన్, జడేజా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 25 వికెట్లు పడగొట్టిన అశ్విన్

IND vs AUS:: ప్లేయర్స్ ఆఫ్ ది సిరీస్‌గా అశ్విన్, జడేజా

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 13, 2023
06:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఆహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగిసింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో దక్కించుకుంది. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత స్టార్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ సంయుక్తగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. చివరి టెస్టులో చెలరేగిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ద మ్యాచ్ అవార్డు లభించింది. భారత్‌ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్‌ (10).. లెజెండరీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లేతో (10) సమంగా నిలిచాడు.

జడేజా

డ్రాగా ముగిసిన చివరి టెస్టు

మ్యాచ్ విషయానికొస్తే పిచ్ బౌలర్లకు సహకరించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ట్రవిస్‌ హెడ్‌ (90) త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా.. లబూషేన్‌ (63) అజేయ అర్ధసెంచరీతో రాణించాడు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మాన్ గిల్ (128), విరాట్ కోహ్లీ(186) శతకాలతో విజృంభించారు. భారత స్పిన్ ద్వయం జడేజా, అశ్విన్ నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సంచలనం సృష్టించారు. అశ్విన్ 17.28 సగటుతో 25 వికెట్లు పడగొట్టి సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.