IND vs AUS: చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర పటేల్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్టులో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర పటేల్ చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్‌ను ఔట్ చేసి ప్రత్యేక మైలురాయిని అందుకున్నాడు. భారత్ తరుపున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అక్షర్ పటేల్ రికార్డు క్రియేట్ చేశాడు. దీంతో ఇప్పటివరకూ టీమిండియా బౌలర్ జస్ప్రిత్ బుమ్రా పేరిట ఉన్న ఈ రికార్డును అక్షర్ పటేల్ ప్రస్తుతం బ్రేక్ చేశాడు. 2465 బంతుల్లో బుమ్రా 50 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిస్తే.. అక్షర్ పటేల్ 2205 బంతుల్లోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు.
బ్యాటింగ్‌లోనూ రాణిస్తున్న అక్షర్ పటేల్
మరోపక్క అక్షర పటేల్ బ్యాటింగ్‌లోనూ అదరగొడుతూ 4 టెస్టుల్లో 264 పరుగులను చేశారు. ఇందులో తొమ్మిది సిక్సర్లు కూడా ఉన్నాయి. ఈ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా అక్షర్ పటేల్ నిలిచాడు మొతేరా స్టేడియంలో రెండు టెస్టులాడి 21 వికెట్లు తీసిన అక్షర్ పటేల్, తొలి ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లు వేసి ఒకే ఒక్క వికెట్ తీశాడు ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో అక్షర్ పటేల్ టీమిండియాకి స్టార్ పర్ఫామర్‌గా మారిపోయాడు.