Page Loader
Ravindra Jadeja Record: లెజెండరీ ప్లేయర్స్ సరసన రవీంద్ర జడేజా
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న రవీంద్ర జడేజా

Ravindra Jadeja Record: లెజెండరీ ప్లేయర్స్ సరసన రవీంద్ర జడేజా

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2023
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా అల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. లెజెండరీ ప్లేయర్స్ కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్ ల సరసన నిలిచి అద్భుత రికార్డును జడేజా సాధించారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఈ సంచలన రికార్డును జడ్డూ క్రియేట్ చేశాడు. గాయం నుంచి కోలుకొని వచ్చిన తరువాత జడేజా అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. స్పిన్‌తో ఆస్ట్రేలియా బ్యాటర్లను బెంబేలిస్తున్నాడు. ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్ వికెట్లు హిస్టరి క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్లు, 5వేల పరుగులు చేసిన రెండో ఇండియన్ ప్లేయర్‌గా జడేజా నిలిచాడు. ఈ లిస్టులో జడేజా కంటే ముందు స్థానంలో కపిల్ దేవ్ ఉన్నాడు.

రవీంద్ర జడేజా

11వ ప్లేయర్‌గా రవీంద్ర జడేజా రికార్డు

కపిల్ దేవ్ తన కెరీర్‌లో మొత్తం 356 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, 687 వికెట్లు తీయడంతో పాటు 9031 పరుగులు చేశాడు. తాజాగా జడేజా ఇండియా తరుపున 298 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 500 వికెట్లు, 5వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన 11వ ప్లేయర్‌గా నిలవడం విశేషం. జడేజా కంటే ముందు కపిల్ దేవ్, వసీం అక్రమ్, జాక్ కలిస్, ఇమ్రాన్ ఖాన్, షకీబుల్ హసన్, షాహిద్ అఫ్రిది, డేనియల్ వెటోరి, చమందా వాస్, షాన్ పొలాక్, ఇయాన్ బోథమ్ ఈ ఘనత సాధించారు.