Page Loader
AUS vs IND: ఆసీస్‌తో తొలి టెస్టులో విఫలమైన భారత బ్యాటర్లు.. 150 పరుగులకు ఆలౌట్
ఆసీస్‌తో తొలి టెస్టులో విఫలమైన భారత బ్యాటర్లు.. 150 పరుగులకు ఆలౌట్

AUS vs IND: ఆసీస్‌తో తొలి టెస్టులో విఫలమైన భారత బ్యాటర్లు.. 150 పరుగులకు ఆలౌట్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 22, 2024
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాతో జరుగుతున్న (AUS vs IND) తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగుల వద్ద ఆలౌటైంది. తెలుగు యువకుడు నితీశ్ రెడ్డి (41) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. నితీశ్‌తో పాటు పంత్ (37), కేఎల్ రాహుల్ (26), ధ్రువ్ జురెల్ (11) మాత్రమే రెండంకెల స్కోరు సాధించగలిగారు. యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరారు. విరాట్ కోహ్లీ (5), సుందర్ (4), హర్షిత్ రాణా (7), బుమ్రా (8) కూడా విఫలమయ్యారు. ఆసీస్‌ బౌలర్లు జోష్ హేజిల్‌వుడ్ (4/29), ప్యాట కమీన్‌స్ (2/14), షాన్ మార్ష్ (2/12), మిచెల్ స్టార్క్ (2/14) ఆత్మవిశ్వాసంగా బౌలింగ్‌ చేశారు.

వివరాలు 

పేస్‌ దెబ్బకు విలవిల.. 

దూకుడుగా ఆడే యశస్వి జైస్వాల్ 8 బంతులు ఆడిన తరువాత పరుగులు చేయకుండానే పెవిలియన్‌కు చేరాడు. పిచ్‌ పేస్‌కు అనుకూలంగా ఉండటంతో పరుగులు రాబట్టడం కష్టం అయింది. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ క్రీజ్‌లో నిలబడినా, జట్టులోకి మళ్ళీ వచ్చిన దేవదత్ పడిక్కల్ 23 బంతులు ఆడిన తరువాత ఒక్క పరుగు లేకుండా ఔటయ్యాడు. అతన్ని హేజిల్‌వుడ్ ఔట్ చేశాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ కాస్త జోరుగా ఆడినా, హేజిల్‌వుడ్ బౌన్సర్‌ను జయించలేక స్లిప్‌లో ఔటయ్యాడు. స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోయిన భారత్ తమ ఇన్నింగ్స్‌ను ఆదుకొనేందుకు రిషభ్ పంత్ ధైర్యంగా ఆడటం ప్రారంభించాడు. బౌండరీలు కొట్టేందుకు ప్రయత్నించాడు.

వివరాలు 

పరుగులు రాబట్టే క్రమంలో నితీశ్ రెడ్డి దూకుడు

కానీ ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్‌లు అనుకన్నంత మేర సక్సెస్ కాలేకపోయారు. యువ క్రికెటర్ నితీశ్ రెడ్డితో కలిసి పంత్ 7వ వికెట్‌కు 48 పరుగులు జోడించి టీమ్‌ఇండియా స్కోరు 150కి చేరడానికి కారణమయ్యారు. ఈ క్రమంలో పంత్‌ను కమీన్‌స్ ఔట్ చేశాడు. బుమ్రా కొంచెం జోష్ తెప్పించినా, అతడూ త్వరగా ఔటయ్యాడు. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో నితీశ్ రెడ్డి కూడా దూకుడు పెంచాడు, కానీ కమీన్‌స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఖవాజా చేతికి చిక్కాడు. దీనితో భారత ఇన్నింగ్స్ ముగిసింది.