
IND vs AUS : చివరి టెస్టుకు హజరైన ప్రధానమంత్రులు మోడీ, ఆంటోని ఆల్బనీస్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా గురువారం నుంచి ప్రారంభమైన చివరి టెస్టుకు ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ హజరయ్యారు.
ప్రధాని మోదీకి గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్, రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి జే షా స్వాగతం పలికారు.
మార్చి 11 వరకు భారత్‌లో అధికారిక పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ నిన్న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్వాగతం పలికారు.
మే 2022లో ఆస్ట్రేలియా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ, అల్బనీస్‌ను కలవడం ఇది నాలుగోసారి.
ఇండియా
భారతీయ విద్యార్థుల కోసం నూతన స్కాలర్‌షిప్స్
గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియా డీకిన్ యూనివర్సిటీ అంతర్జాతీయ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా అల్బనీస్ ప్రకటించాడు. భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో నాలుగు సంవత్సరాల వరకు చదువుకోవడానికి కొత్త స్కాలర్‌షిప్ ను ప్రవేశపెడుతున్నట్లు ఆయన ప్రకటించారు.
ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ బుధవారం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమ పర్యటనలో ఆయనతో పాటు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఉన్నారు. అనంతరం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో అల్బనీస్ హోలీ వేడుకలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు సంప్రదాయ నృత్య రూపాలను ప్రదర్శించారు.