Page Loader
IND vs AUS: నవంబర్ 22 నుండి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. ఈ మ్యాచ్ ఇండియాలో ఎప్పుడు, ఏ టైంలో చూడాలంటే..
నవంబర్ 22 నుండి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ

IND vs AUS: నవంబర్ 22 నుండి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. ఈ మ్యాచ్ ఇండియాలో ఎప్పుడు, ఏ టైంలో చూడాలంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2024
03:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25‌లో భాగంగా, టీమిండియా నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని పెర్త్ స్టేడియంలో జరగనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కింద గతంలో నాలుగు టెస్టుల సిరీస్ మాత్రమే జరిగేవి, అయితే ఈసారి ఐదు టెస్టుల సిరీస్ జరుగనుంది. తొలి టెస్ట్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం నవంబర్ 22న ఉదయం 7:50 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ ఉదయం 7:20 గంటలకు వేస్తారు.

వివరాలు 

మ్యాచ్‌లో సెషన్‌ల సమయాలు 

మొదటి సెషన్: ఉదయం 7:50 నుండి 9:50 వరకు లంచ్ బ్రేక్: 9:50 నుంచి 10:30 వరకు రెండో సెషన్: ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు టీ బ్రేక్: 12:30 నుంచి 12:50 వరకు మూడో సెషన్: మధ్యాహ్నం 12:50 నుండి 2:50 వరకు అన్ని సమయాలు భారత కాలమానం ప్రకారం

వివరాలు 

ఎక్కడ చూడాలి? 

ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో లభ్యం అవుతుంది. మీరు మీ మొబైల్, టీవీ లేదా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చూడవచ్చు. జట్టులో కీలక మార్పులు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి టెస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడంలేదు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా తొలి మ్యాచ్ మిస్సవుతాడు. రెండో టెస్టు నుంచి రోహిత్ శర్మ జట్టులో చేరతాడు. పేసర్ మహ్మద్ షమీ కూడా రెండో టెస్టుకు ముందుగా జట్టులో చేరే అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్ ఫిట్‌గా ఉంటే, అతను కూడా రెండో టెస్ట్‌లో జట్టులోకి వస్తాడు. ఈ కీలక మ్యాచ్‌లను మిస్ కాకుండా భారత కాలమానానికి అనుగుణంగా ప్రణాళిక చేసుకోండి!