మొదటి టెస్టులో రాణించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ లబుషాగ్నే
నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్టు జరిగింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా టపటపా వికెట్లను కోల్పోయింది. అయితే ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషాగ్నే అద్భుతంగా ఆడాడు. టాప్ ఆర్డర్ మొత్తం పెవిలియానికి క్యూ కట్టగా.. లబుషాగ్నే 49 పరుగులు చేశారు. స్టీవెన్ స్మిత్‌తో కలిసి 82 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకున్న మూడు ఓవర్లలోనే ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్‌లను కోల్పోయింది. అనంతరం లాబుస్‌చాగ్నే, స్మిత్ మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. 123 బంతులు ఆడిన లాబుస్ చాగ్నే 49 పరుగులు చేశాడు. అనంతరం రవీంద్ర జడేజా అతడిని స్టంపౌంట్ చేశాడు.
లబుషాగ్నే సాధించిన రికార్డులివే
2018లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన లబుషాగ్నేప్రస్తుతం 34 టెస్టుల్లో 3,199 పరుగులు చేశాడు. ఇందులో పది సెంచరీలు, 14 అర్ధ సెంచరీలున్నాయి. లబుషాగ్నే కేవలం 51 ఇన్నింగ్స్‌లలో 3,000 టెస్ట్ పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఈ మైలురాయిని సాధించాడు. ఆసీస్ దిగ్గజం డొనాల్డ్ బ్రాడ్‌మన్ మాత్రమే 33 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించాడు. 2022లో 11 టెస్టులు ఆడి 957 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉంది.