Page Loader
India vs Prime Minister's XI: అడిలైడ్ టెస్టుకు ముందు భారత జట్టు మరో వార్మప్ మ్యాచ్.. శుభ్‌మన్‌ గిల్‌ సిద్ధం..!
అడిలైడ్ టెస్టుకు ముందు భారత జట్టు మరో వార్మప్ మ్యాచ్.. శుభ్‌మన్‌ గిల్‌ సిద్ధం..!

India vs Prime Minister's XI: అడిలైడ్ టెస్టుకు ముందు భారత జట్టు మరో వార్మప్ మ్యాచ్.. శుభ్‌మన్‌ గిల్‌ సిద్ధం..!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 29, 2024
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత యువ క్రికెటర్ శుభమన్ గిల్, వేలికి గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగే (AUS vs IND) తొలి టెస్టుకు దూరమైనప్పటికీ, వేగంగా కోలుకుంటున్నాడు. మొదట్లో గిల్ రెండో టెస్టుకు ఆడటం కష్టమని వార్తలు వచ్చాయి.అయితే,ప్రస్తుతం అతడు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నట్టు తాజా సమాచారం వచ్చింది. భారత్ శనివారం నుంచి ఆసీస్‌ ప్రైమ్‌మినిస్టర్స్‌ XIతో రెండు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఇది డే/నైట్ మ్యాచ్‌గా నిర్వహించనున్నారు.డిసెంబర్ 6 నుండి అడిలైడ్‌ వేదికగా పింక్‌బాల్ టెస్టు జరగనుంది,అందుకోసం భారత్‌ ఈ వార్మప్‌ మ్యాచ్‌ను ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గిల్‌ కూడా పాల్గొంటాడని క్రికెట్ వర్గాలు చెప్తున్నాయి.నెట్స్‌లో మంచి ప్రదర్శన చూపిస్తున్న గిల్ బంతిని సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు తెలిపి,అతని కోలుకున్న విషయం నిర్ధారించాయి.

వివరాలు 

ఎప్పుడు? ఎలా చూడొచ్చంటే? 

అలాగే, వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ప్రస్తుతానికి సిద్ధమయ్యాడు. కాబట్టి, వీరిద్దరూ తుది జట్టులో చేరితే, మొదటి టెస్టులో ఆడిన దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్‌ తుది జట్టుకు ఎంపిక కాకపోవచ్చు. అయితే, బ్యాటింగ్ ఆర్డర్‌ను కూర్పడం కీలకమైన అంశంగా మారే అవకాశం ఉంది.అందుకే,వార్మప్‌ మ్యాచ్‌ను కూడా ఒక ప్రయోగంగా ఉపయోగించవచ్చు. భారత్,ప్రైమ్ మినిస్టర్స్‌ XI మధ్య వార్మప్ మ్యాచ్‌ నవంబర్ 30-డిసెంబర్ 1న జరుగనుంది. ఈ మ్యాచ్‌ లో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తుండగా,ప్రైమ్ మినిస్టర్స్‌ XIను జాక్ ఎడ్వర్డ్స్‌ నడిపిస్తాడు. ఆసీస్‌ బౌలర్ స్కాట్ బోలాండ్‌ కూడా ఈ మ్యాచ్‌లో పాల్గొంటాడు.ఈవార్మప్‌ మ్యాచ్‌ కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌ మైదానంలో జరుగుతుంది.

వివరాలు 

స్క్వాడ్‌లు ఇవే 

ఉదయం 9:10గంటలకు (భారత కాలమానం ప్రకారం)మ్యాచ్ ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్‌ను డిస్నీ హాట్‌స్టార్‌ OTT తో పాటు స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానళ్లలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ప్రైమ్‌మినిస్టర్స్‌ XI: జాక్ ఎడ్వర్డ్స్‌ (కెప్టెన్), ఛార్లీ అండర్సన్, మహ్లి బియార్డ్‌మన్, స్కాట్‌ బోలాండ్, జాక్ క్లేటన్, ఐదన్ ఓకొనూర్, ఓలీ డేవీస్, జైదెన్ గుడ్‌విన్, సామ్‌ హర్పర్, హన్నో జాకబ్స్, సామ్ కొన్సాస్, పోప్, మ్యాథ్యూ రెన్‌షా, జెమ్ రైన్ భారత్: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్,నితీశ్‌ రెడ్డి,వాషింగ్టన్ సుందర్,హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్,రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌ దీప్, సర్ఫరాజ్‌ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, రవీంద్ర జడేజా