IND vs AUS: 8 వికెట్లతో నాథన్ లియాన్ విశ్వరూపం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓటమి దిశగా సాగుతోంది. ఇండోర్‌లోని హెల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియన్ స్పిన్నర్ 8 వికెట్లు తీయడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 163 పరుగులకు అలౌటైంది. దీంతో ఆసీస్‌కు 76 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టెస్టు క్రికెట్‌లో భారత్‌పై అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా లియాన్‌కు మంచి రికార్డు ఉంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మరశీధరన్ రికార్డును లియాన్ అధిగమించి సంచలన రికార్డును క్రియేట్ చేశాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియాకు అత్యుత్తమ సేవకుల్లో లియాన్ ఒకరు. ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్ తర్వాత లియాన్ ఆస్ట్రేలియాకు రెండోవ అత్యంత విజయవంతమైన స్పిన్నర్ అని చెప్పొచ్చు.
పుజారాను 12సార్లు అవుట్ చేసి లియాన్
మురళీధరన్ భారత్‌పై 22 టెస్టుల్లో 32.61 సగటుతో 105 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం లియాన్ టీమిండియా 108 టెస్ట్ వికెట్లు సాధించి రికార్డును తన పేరిట రాసుకున్నాడు. 118 టెస్టులు ఆడిన లియోన్ 474 వికెట్లను పూర్తి చేశాడు. డిసెంబర్ 2022లో మురళీధరన్ తర్వాత టెస్ట్ క్రికెట్‌లో 450 వికెట్లు తీసిన రెండో ఆఫ్‌స్పిన్నర్‌గా లియాన్ నిలిచాడు. లియోన్ టెస్టుల్లో పుజారాను 12 సార్లు అవుట్ చేశాడు.