ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌కి మాతృవియోగం
ఆస్ట్రేలియా క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి మరియా ఈ రోజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సిడ్నీలో తుదిశ్వాస విడిచారు. తల్లి అనారోగ్యం కారణంగా రెండో టెస్టు ముగిసిన వెంటనే స్వదేశానికి వెళ్లిన కమిన్స్.. మూడో టెస్టు నాటికి తిరిగి వస్తాడని భావించినప్పటికీ తల్లి ఆరోగ్యం విషమంగా ఉండటంతో అక్కడే ఉండిపోయాడు. కమిన్స్ తల్లి మరియా మృతికి క్రికెట్ ఆస్ట్రేలియా సంతాపం తెలిపింది. ఆమె మృతికి సంతాపంగా ఆహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్టు రెండురోజు ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండ్లు తగిలించుకొని మైదానంలోకి వచ్చారు.
టెస్టుల్లో సంచలనం సృష్టించిన కమిన్స్
కమిన్స్ తల్లి 2005లో రొమ్ము కేన్సర్ బారినపడ్డాడు. ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో రెండు టెస్టు అనంతరం కమిన్స్ తల్లి చూసేందుకు సిడ్నీ వెళ్లాడు. దీంతో అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ నాయకత్వ బాధ్యతలను స్వీకరించాడు. ప్రస్తుతం టెస్ట్ బౌలింగ్స్ ర్యాకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్న కమిన్స్ టెస్టుల్లో సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం 49 టెస్టుల్లో 217 వికెట్లు పడగొట్టాడు. అతని సారథ్యంలో ఆస్ట్రేలియా 15 టెస్టులు ఆడి ఎనిమిది విజయాలను సాధించింది. ఇందులో నాలుగు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో మూడు వికెట్లను మాత్రమే కమిన్స్ తీశాడు.