Page Loader
IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 -25 షెడ్యూల్ విడుదల.. అడిలైడ్‌లో డే నైట్ టెస్ట్ 
IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 -25 షెడ్యూల్ విడుదల

IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 -25 షెడ్యూల్ విడుదల.. అడిలైడ్‌లో డే నైట్ టెస్ట్ 

వ్రాసిన వారు Stalin
Mar 26, 2024
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియా- ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగే ఐదు టెస్టు మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ జరుగనుంది. ఈ ఏడాది న‌వంబ‌ర్ 22 నుంచి ప్రారంభంకానున్న ఈ సిరీస్ కి సంబంధించిన షెడ్యూల్‌ ను క్రికెట్ ఆస్ట్రేలియా ఈరోజు విడుదల చేసింది. 1991-92 తర్వాత భారత్, ఆస్ట్రేలియాలు ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడడం ఇదే తొలిసారి. భారత్ 46 రోజుల్లో కంగారూ జట్టుతో 5 టెస్టులు ఆడాల్సి ఉంది. నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

Details 

2025 జనవరిలో ఐదో టెస్ట్ 

తొలి టెస్టు పెర్త్‌లో జరగనుంది.ఈ సిరీస్ ను పెర్త్ లో ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. మొదటి టెస్ట్ నవంబర్ 22-26 మధ్య జరుగనుంది. రెండవ టెస్ట్ అడిలైడ్ లో జరుగుతుంది. అక్కడ డిసెంబర్ 6 నుండి 10 మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇది డే-నైట్ టెస్ట్.బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 14 నుంచి 18 వరకు జరగనుంది. డిసెంబర్ 26- 30 మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బాక్సింగ్ డే టెస్ట్ జరగనుంది. ఈ సిరీస్‌లో ఇది నాలుగో టెస్టు. 2025 సంవత్సరంలో జనవరి 3- 7 మధ్య సిడ్నీ లో జరిగే ఇదో టెస్ట్ తో ఈ సిరీస్ ముగుస్తుంది.