
AUS vs IND: పింక్ బాల్ టెస్టులో తొలి రోజు ముగిసిన ఆట.. ఆస్ట్రేలియాదే పైచేయి
ఈ వార్తాకథనం ఏంటి
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్,భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఈ రోజు ప్రారంభమైంది.
పింక్ బాల్ (డే/నైట్) మ్యాచ్‌లో మొదటి రోజు ఆస్ట్రేలియా పైచేయి సాధించింది.
తొలుత టీమిండియాను 180 పరుగులకే ఆలౌట్ చేసిన, ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లోనూ అదే జోరు ప్రదర్శించారు .
తొలి రోజు ఆట ముగిసే సమయానికి, ఆసీస్ 86/1 స్కోరుతో బలమైన స్థితిలో ఉంది.
మార్నస్ లబుషేన్ (20*; 67 బంతుల్లో 3 ఫోర్లు) మెక్‌స్వినీ (38*; 97 బంతుల్లో 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.
ఉస్మాన్ ఖవాజా (13)ను బుమ్రా ఔట్ చేశాడు. ఆస్ట్రేలియా 24 పరుగుల వద్ద ఉండగా, ఖవాజా బుమ్రా బౌలింగ్‌లో స్లిప్‌లో రోహిత్ క్యాచ్ పట్టడంతో ఔట్ అయ్యాడు.
వివరాలు
భారత తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌట్
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో, ఆసీస్ ఇంకా 94 పరుగుల వెనుక ఉంది.
రెండో రోజు ఆట ప్రారంభంలో, భారత బౌలర్లు ఆసీస్‌పై ఒత్తిడిని పెంచి వీలైనన్ని ఎక్కువ వికెట్లు పడగొట్టి కంగారులను ఒత్తిడిలోకి నెట్టాలి. లేకపోతే ఆసీస్ భారీ ఆధిక్యం సాధించడం ఖాయం.
భారత తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌట్ అయింది.తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ (6/48)ధాటికి భారత టాప్ ఆడగాళ్లు కష్టాల్లో పడ్డారు. స్టార్క్‌తో పాటు కమిన్స్ 2, స్కాట్ బోలాండ్ 2 వికెట్లు తీశారు.
భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 37, శుభ్‌మన్ గిల్ 31,అశ్విన్ 22,రిషభ్ పంత్ 21 పరుగులు చేశారు.