ముగ్గురు ఆఫ్ స్పిన్నర్లతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ఢిల్లీలో మొదలైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు స్వల్ప మార్పులతో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా మ్యాట్ రెన్ షా స్థానంలో ట్రావిస్ హెడ్ ను జట్టులోకి తీసుకుంది. బోలాండ్ స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ మ్యాథ్యూ కున్మెన్ కు ప్లేస్ దక్కింది. టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ స్థానంలో గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్‌కి తుది జట్టులో అవకాశం కల్పించారు. మాథ్యూ కుహ్నెమాన్ 1996 సెప్టెంబర్ 20న జన్మించాడు. 2015-16లో క్వీన్స్‌లాండ్ ప్రీమియర్ క్రికెట్ పోటీలో 35 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. దేశవాళీ క్రికెట్‌లో క్వీన్స్‌లాండ్‌కు ప్రాతినిధ్యం వహించిన అతను ఫిబ్రవరి 2021లో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.
టీమిండియా విజయావకాశాలు ఎక్కువ
గతేడాది కుహ్నెమాన్ అంతర్జాతీయ అరంగేట్రం చేసి ఇప్పటివరకూ నాలుగు వన్డేలను ఆడాడు. ఇందులో ఆరు కీలక వికెట్లను పడగొట్టాడు. స్పిన్నర్లకు అనుకూలమైన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండవ టెస్ట్ జరుగుతోంది. టీమిండియా, ఆస్ట్రేలియా ముగ్గురు స్పిన్నర్లతో మ్యాచ్ ఆడుతోంది. మొదటి టెస్టులో అరంగేట్రం చేసిన ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ ఏడు వికెట్లు తీసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఆడిన టెస్టుల్లో భారత్ ఇప్పటివరకూ ఓటమి లేదు. దీంతో భారత్‌కు ఈ మ్యాచ్‌లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా చివరిసారిగా 2014-15లో భారత్‌పై టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది.