భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్ట్ వేదిక మార్పు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్‌కు ఆదిరిపోయే ఆరంభం లభించింది. నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 132 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. ఫిబ్రవరి 17న ఢిల్లీ వేదికగా ఆసీస్‌తో రెండో టెస్టు ఆడనుంది. కాగా ధర్మశాల వేదికగా మూడో టెస్టు జరగాల్సి ఉండగా.. ప్రస్తుతం బీసీసీఐ వేదికను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ధర్మశాలలో ఇటీవలే పిచ్, ఔట్ ఫీల్డ్‌ను మార్చారు. ఆ తర్వాత అక్కడ ఇక్కడ ఎలాంటి మ్యాచ్‌లు ఆడలేదు. దీంతో బీసీసీఐ వేదికను మార్చింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు మ్యాచ్‌ను ధర్మశాల నుంచి ఇండోర్‌కు మార్చారు. పర్వత ప్రాంతంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నందున హోల్కర్ స్టేడియం మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇండోర్ లో మూడో టెస్ట్ మ్యాచ్
హిమాచల్‌ప్రదేశ్‌లో ధర్మశాల క్రికెట్ స్టేడియం, ప్రపంచంలోని అత్యంత అందమైన క్రికెట్ గ్రౌండ్స్‌లో ఒకటి. ధర్మశాల స్టేడియం నుంచి హిమాలయాలు కనిపిస్తూ, ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తాయి. ధర్మశాల క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ జరిగింది. ఇండోర్‌కు మార్చడంపై ప్రస్తుతం భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ధర్మశాలలో పిచ్ ఆస్ట్రేలియాకి బాగా కలిసి వస్తుందనే ఉద్దేశంతోనే వేదికని ఇండోర్‌కి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారని కొందరు అభిమానులు ఆరోపణలు చేయడం గమనార్హం. చివరి టెస్టు మ్యాచ్ మార్చి 09న అహ్మదాబాద్‌లో జరగనుంది.