Page Loader
AUS vs IND: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ.. రెండో రోజు ముగిసిన ఆట.. పంత్ మెరుపు హాఫ్ సెంచరీ
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ.. రెండో రోజు ముగిసిన ఆట.. పంత్ మెరుపు హాఫ్ సెంచరీ

AUS vs IND: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ.. రెండో రోజు ముగిసిన ఆట.. పంత్ మెరుపు హాఫ్ సెంచరీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2025
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, టీమిండియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు జరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో 141 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో జడేజా (8*), సుందర్ (6*) ఉన్నారు. ప్రస్తుతం భారత్ 145 పరుగుల ఆధిక్యంలో ఉంది. రిషభ్ పంత్ (61: 33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు) ఆకట్టుకునే హాఫ్ సెంచరీతో రాణించాడు. యశస్వి జైస్వాల్ (22) ఫర్వాలేదనిపించగా, శుభ్‌మన్ గిల్ (13, కేఎల్ రాహుల్ (13) తమ ఆరంభాలను వృథా చేసుకున్నారు.

Details

నాలుగు వికెట్లు పడగొట్టిన బోలాండ్

ఈ ఇన్నింగ్స్‌లో బౌలర్లలో బోలాండ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, కమిన్స్, వెబ్‌స్టర్ తలో వికెట్ తీశారు. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 185 పరుగులకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా జట్టు 181 పరుగులకు పరిమితమైంది. ప్రస్తుతం మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది.