AUS vs IND: బాక్సింగ్ డే టెస్టు.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్నబాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల వద్ద ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140)సెంచరీతో రాణించగా,మార్నస్ లబుషేన్ (72),సామ్ కాన్‌స్టాన్స్(60),ఉస్మాన్ ఖవాజా (57)అర్ధసెంచరీలు సాధించారు. పాట్ కమిన్స్ (49), అలెక్స్ కేరీ(31)విలువైన స్కోరు చేయగా, ట్రావిస్ హెడ్ డకౌట్ కాగా, మిచెల్ మార్ష్ (4) విఫలమయ్యాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీయగా,రవీంద్ర జడేజా 3 వికెట్లు,ఆకాశ్ దీప్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు. చివర్లో ఆసీస్ టెయిలెండర్లు దాదాపు తొమ్మిది ఓవర్ల పాటు వికెట్ ఇవ్వకుండా టీమ్ ఇండియా బౌలర్లను సతాయించారు. అయితే,బుమ్రా బౌలింగ్‌లో నాథన్ లైయన్ (13)చివరి వికెట్‌గా పెవిలియన్ చేరడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.