LOADING...
BGT: తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం
తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం

BGT: తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 25, 2024
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్ గవాస్కర్-ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా 295 పరుగుల తేడాతో గెలుపొందింది. 534 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 238 పరుగులకే ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ (89), మిచెల్ మార్ష్ (47), అలెక్స్ (41) మినహా మిగతా ప్లేయర్లు విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తలా మూడు వికెట్లు తీశారు. ఇక సుందర్ రెండు, నితీష్ రెడ్డి ఒక వికెట్ తీశారు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది.