Border-Gavaskar Trophy: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఎప్పుడు, ఎలా మొదలైంది,ఈ పేరెలా వచ్చిందంటే?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 సిరీస్ ప్రారంభానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. నవంబర్ 22 నుండి పెర్త్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టుతో ఈ ప్రతిష్ఠాత్మక సిరీస్ ప్రారంభం కానుంది. భారత్, ఆసీల మధ్య జరిగే ఈ సిరీస్ ప్రత్యేకత ఏమిటంటే, దాని ఫలితం ఎంత ఉన్నా, ఈ సిరీస్‌లో గెలవడం ఇరుజట్లకు అత్యంత గౌరవం. ఆద్యంతం నువ్వా-నేనా అన్నట్లుగా సాగే ఈ సిరీస్ యాషెస్ సిరీస్‌ను తలపిస్తుంది. ఈ ప్రత్యేకమైన సిరీస్ ఎప్పుడు ప్రారంభమైంది? దాని పేరును ఎలా పొందింది? ఏ జట్టు ఎంతమంది విజేతలుగా నిలిచింది? అన్న విషయాలను ఇప్పుడు చూద్దాం.
సిరీస్ ఆలోచన, ప్రారంభం
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 1996లో ప్రారంభమైంది. ఆ సంవత్సరంలో ఒకే ఒక టెస్టు మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా భారత్‌లో పర్యటించింది. ఈ సమయంలో ఇరుజట్లకు విశేష సేవలందించిన క్రికెట్ దిగ్గజాలు సునీల్ గావస్కర్ , అలెన్ బోర్డర్ గౌరవార్థం ఒక సిరీస్ నిర్వహించేందుకు రెండు దేశాల బోర్డులు నిర్ణయించాయి. వెంటనే ఈ సిరీస్‌కు "బోర్డర్-గావస్కర్ ట్రోఫీ" పేరును పెట్టారు. తొలి సిరీస్‌ను టీమిండియా గెలిచింది. ఆ విధంగా ఈ సిరీస్ ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతోంది. గావస్కర్, బోర్డర్‌లకు 10,000 కి పైగా టెస్టు పరుగులు సాధించి, తమ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషించారు.
టీమిండియాదే హవా
ఇప్పటివరకు బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 16 సార్లు నిర్వహించబడింది, అందులో 10 సార్లు భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా 5 సార్లు గెలిచింది, ఒకసారి (2003/04) సిరీస్ డ్రా అయింది. గత నాలుగు సిరీస్‌లలో టీమిండియా విజయం సాధించింది. భారత్‌లో ఈ ట్రోఫీ 9 సార్లు జరిగితే, ఆస్ట్రేలియా సొంతగడ్డపై ఒక్కసారే (2004/05) గెలిచింది. 2017 నుంచి, టీమిండియా ఆస్ట్రేలియాను వారి స్వదేశంలో వరుసగా రెండుసార్లు ఓడించి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇప్పుడు, సరికొత్త సిరీస్‌లో కంగారులను మళ్లీ ఓడించి హ్యాట్రిక్ సాధించాలని టీమిండియా జట్టు ఉత్సాహంగా ఉంది. ఇప్పటి వరకు బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 56 మ్యాచ్‌ల్లో టీమిండియా 24 సార్లు విజయం సాధించగా, ఆస్ట్రేలియా 20 సార్లు గెలిచింది. 12 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.