Page Loader
IND vs AUS: ఆసీస్‌కు గట్టి ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు హేజిల్‌వుడ్ దూరం
ఆసీస్‌కు గట్టి ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు హేజిల్‌వుడ్ దూరం

IND vs AUS: ఆసీస్‌కు గట్టి ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు హేజిల్‌వుడ్ దూరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 30, 2024
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆసక్తికరమైన మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సిరీస్‌లో భాగంగా పెర్త్ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ విజయంతో రెండో టెస్టుకు ఉత్సాహంగా సిద్ధమవుతున్న భారత్ జట్టు, ప్రాక్టీస్ సెషన్‌లు ప్రారంభించింది. అయితే రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి షాక్ తగిలింది. అడిలైడ్‌ ఓవల్‌ వేదికగా జరగనున్న డే-నైట్‌ పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ దూరం కానున్నారు. గాయం కారణంగా అతను దూరం కానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఆయన స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకోవాలనే దానిపై సెలక్టర్లు చర్చలు జరిపారు.

Details

పింక్ బాల్ తో రెండో టెస్టు

గాయం కారణంగా హేజిల్‌వుడ్ ఈ మ్యాచ్‌కు దూరమవుతుండటంతో, అతని స్థానంలో అన్‌క్యాప్‌డ్ పేస్ జోడీ సీన్ అబాట్ లేదా బ్రెండన్ డాగెట్‌లో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. పెర్త్ టెస్టులో హేజిల్‌వుడ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 29 పరుగులకు 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అతను కేవలం 28 పరుగులు ఇచ్చి కట్టుదిట్టమైన బౌలింగ్ చేశాడు. అయితే, సైడ్ స్ట్రెయిన్ గాయం కారణంగా ఇప్పుడు రెండో టెస్టుకు దూరమవుతున్నట్లు తెలిసింది. అడిలైడ్‌ టెస్టు పింక్ బాల్‌తో జరగనున్న కారణంగా మరింత సవాల్‌గా నిలవనుంది.